Jubilee hills bypoll: జూబ్లీహిల్స్ బై పోల్.. ఓటు హక్కు వినియోగించుకున్న నవీన్ యాదవ్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-11-11 04:30:11  IST  )

జూబ్లిహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలివస్తున్నారు. మరోవైపు నామినేషన్ వేసిన నేతలు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Jubilee hills bypoll: జూబ్లీహిల్స్ బై పోల్.. ఓటు హక్కు వినియోగించుకున్న నవీన్ యాదవ్
X

దిశ, వెబ్ డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలివస్తున్నారు. మరోవైపు నామినేషన్ వేసిన నేతలు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎల్లారెడ్డిగూడలోని నవోదయ కాలనీలో కుటుంబసమేతంగా వచ్చి ఓటు వేశారు.

కాగా తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ యూసుఫ్ గుడ ప్రభుత్వ పాఠశాలలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నవీన్ యాదవ్ తన అనుచరులతో వచ్చి ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడు పార్టీలు పోటా పోటీగా ప్రచారం చేశాయి. ఇక నేడు పోలింగ్ జరుగుతుండగా ఈ నెల 14న ఫలితాలు రానున్నాయి.

READ MORE ....

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ షురూ.. 800 మంది కేంద్ర బలగాలతో భద్రత కట్టదిట్టం

Next Story