- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sandhya Theater : సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ
పుష్ప 2 ప్రీమియం షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్(Sandhya Theater) లో జరిగిన తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్(National Human Rights Commission) కు అందిన ఫిర్యాదును విచారణకు స్వీకరించింది.

దిశ, వెబ్ డెస్క్ : పుష్ప 2 ప్రీమియం షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్(Sandhya Theater) లో జరిగిన తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్(National Human Rights Commission) కు అందిన ఫిర్యాదును విచారణకు స్వీకరించింది. న్యాయవాది రామారావు ఇమ్మినేని, కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. పుష్ప 2 ప్రీమియం షో చూసేందుకు అల్లు అర్జున్ , కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్దకుతన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో చేరుకున్నారు. అల్లు అర్జున్ లోపలికి వెళ్లిన సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను నెట్టి వేయడం ప్రారంభించగా, అప్పటికే థియేటర్ లోపలా, బయటా కిక్కిరిసిపోయి ఉన్న అభిమానులు ఆయనను చూసేందుకు ప్రయత్నించడంతో తోపులాట చోటు చేసుకుంది.
ఆ సమయంలో ఆ గుంపులో ఉన్న రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ తొక్కిసలాటలో గాయపడగా అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది వారిని బయటకు లాగి, ఆమె కుమారుడికి సీపీఆర్ చేసి, ఆస్పత్రికి తరలించారు. రేవతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు 105, 118 (1) రెడ్ విత్ 3(5) బీ.ఎన్.ఎస్. కింద సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పైన, ఆయన సెక్యూరిటీ టీమ్ పైనా కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించడంతో ఈ వివాదం మరింత ఆసక్తికరంగా మారింది.
Read More...
Minister Komatireddy: పుష్ఫ-2 బెనిఫిట్ షో ఎఫెక్ట్.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు






