- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యేలా చేస్తాం.. కలెక్టర్ సందీప్‌పై NHRC సీరియస్
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్(National Human Rights Commission) సీరియస్ అయింది.

దిశ, వెబ్‌డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్(National Human Rights Commission) సీరియస్ అయింది. తమ అధికారాలను వినియోగించి వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యేలా చేస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Collector Sandeep Kumar Jha) పట్ల తీవ్ర స్థాయిలో కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత సంవత్సరం ఆగస్టు 2వ తేదీన అనారోగ్యంతో మంచంపై పడి ఉన్న వృద్ధురాలు పిట్ట రామలక్ష్మి(78)ని వీధి కుక్కలు చంపి తినేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై న్యాయవాది ఇమ్మనేని రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి, కలెక్టర్‌ను పూర్తి నివేదిక ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్ కోరింది. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమర్పించిన నివేదిక నిర్లక్ష్య పూరితంగా ఉందని జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా.. నిద్రిస్తున్న వృద్ధురాలినిపై వీధి కుక్కలు దాడి చేసి, చంపి తిన్నాయి. రాజన్న సిరిసిల్ల - ముస్తాబాద్ మండలంలోని వానితాళ్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పక్క ఇంట్లోనే ఉంటున్న కుమారులు వచ్చి చూసేసరికి ముఖం గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైంది. ఊళ్లో కుక్కల నోళ్లకు రక్తం ఉండటాన్ని వారు గుర్తించారు. దీనిపై పోలీసులు సైతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్
— Telugu Scribe (@TeluguScribe) May 20, 2025
తమ అధికారాలను వినియోగించి వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యేలా చేస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్
గత సంవత్సరం ఆగస్టు 2వ తేదీన అనారోగ్యంతో మంచంపై పడి ఉన్న వృద్ధురాలు పిట్ట రామ… https://t.co/ldT4OnTgWC pic.twitter.com/3TqEiXhhT0






