- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీజీపీ జితేందర్‌కి జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు
తెలంగాణ డీజీపీ జితేందర్‌కు జాతీయ మావనహక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. గత నెల 13వ తేదీన రాజేంద్రనగర్ పోలీసుల వేధింపులతో ఆటో డ్రైవర్ చనిపోయాడు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ డీజీపీ జితేందర్‌కు జాతీయ మావనహక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. గత నెల 13వ తేదీన రాజేంద్రనగర్ పోలీసుల వేధింపులతో ఆటో డ్రైవర్ చనిపోయాడు. గండిపేటకు చెందిన మొహమ్మద్ ఇర్ఫాన్ వేధిస్తున్నాడు అంటూ అతడి భార్య రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాత్రి 7:30 గంటల సమయంలో పోలీసులు అతడిని స్టేషన్‌లోని ఓ గదికి తీసుకువెళ్లి రబ్బర్ బెల్డుతో కొట్టారని ఆరోపణలు వస్తున్నాయి.
ఇర్ఫాన్ పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన తరవాత మెట్లపై వాంతులు చేసుకుని కుప్పకూలి పడిపోయాడు. తరవాత కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. ఇర్ఫాన్ మృతికి రాజేంద్రనగర్ పోలీసులే కారణం అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లనే చనిపోయాడని చెబుతున్నారు. డ్రైవర్ మృతిని జాతీయ మానవహక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.






