వివాహం కావట్లేదని మనస్తాపంతో రైలు కిందపడి ఆత్మహత్య....

by Bhanu |

మిర్యాలగూడ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం చల్ల కళ్యాణ్ (27) అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్టు మిర్యాలగూడ రైల్వే ఏఎస్సై బి. సుబ్బారావు తెలిపారు.

వివాహం కావట్లేదని మనస్తాపంతో రైలు కిందపడి ఆత్మహత్య....
X

దిశ, మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం చల్ల కళ్యాణ్ (27) అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్టు మిర్యాలగూడ రైల్వే ఏఎస్సై బి. సుబ్బారావు తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలోనే రాంనగర్ బంధానికి చెందిన చల్లా లింగయ్య కుమారుడైన చల్ల కళ్యాణ్ స్థానికంగా నివాసం ఉంటున్నాడు. 27 ఏళ్ల వయసు వచ్చిన వివాహం కాకపోవడంతో కొంతకాలంగా తీవ్రమ నస్థాపంతో ఉన్నాడు. బుధవారం బంధువుల ఇంట్లో వివాహానికి హాజరైన కళ్యాణ్ ఇంటికి తిరిగి వచ్చాడు. మనస్థాపంతో గురువారం తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి చల్లా లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎ.ఎస్ .ఐ తెలిపారు. మృతదేహానికి మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు.




Next Story