- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెట్టుకు ఉరేసుకొని యువకుని ఆత్మహత్య
చేతికొచ్చిన కొడుకు ఏదైనా పని చేస్తే తన కష్టాలు తీరుతాయని ఆశించిన తల్లికి పుత్రకోషా మిగిల్చాడు కుమారుడు.

దిశ, ఆలేరు టౌన్ : చేతికొచ్చిన కొడుకు ఏదైనా పని చేస్తే తన కష్టాలు తీరుతాయని ఆశించిన తల్లికి పుత్రకోషా మిగిల్చాడు కుమారుడు. పేదరికంలో ఉన్న కుటుంబం కొనసాగుతున్న భర్తను కోల్పోయినప్పటికీ కుమారుడు పెంచి పోషిస్తాడని అనుకున్న తల్లి కి ఉన్న ఒక్క కొడుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె దుఃఖాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని భరత్ నగర్ కు చెందిన ఇబ్రహీం , సోనీ దంపతులకు, ఇద్దరు సంతానం కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న క్రమంలో ఇంటి పెద్ద ఇబ్రహీం కొన్నేళ్ల క్రితం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
సోనీ కూలి పని చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషిస్తుంది. మూడు నెలల క్రితం కూతురు పెళ్లి చేసింది. కొడుకు యూసుఫ్ (17) చెడు స్నేహితులతో తిరుగుతూ చెడు వ్యసనాలకు అలవాటయ్యాడు. తల్లి సోనితోపాటు బంధువులు కాలనీవాసులు యూసుఫ్ ను మనసు మార్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గురువారం ఆలేరు పట్టణ కేంద్రంలోని బీరప్ప గుడి సమీపంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూసుఫ్ డీజే బాక్స్లు నడిపే వాడని స్థానికులు చెబుతున్నారు. సంఘటన విషయంపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు






