యువత భగత్‌సింగ్‌ అడుగుజాడల్లో నడవాలి

by Naveena |

డ్రగ్స్, గంజాయికి వ్యతిరేకంగా యువతపోరాటం చేయాలని జంగాల కృష్ణయ్య అన్నారు. దే

యువత భగత్‌సింగ్‌ అడుగుజాడల్లో నడవాలి
X

దిశ,నిడమనూరు : డ్రగ్స్, గంజాయికి వ్యతిరేకంగా యువతపోరాటం చేయాలని జంగాల కృష్ణయ్య అన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో భగత్ సింగ్ చూపిన స్ఫూర్తితో నేడు యువత పని చేయాలన్న ఉద్దేశంతో.. కూడిన కరపత్రాలను, భగత్ సింగ్ చిత్రాలను మంగళవారం తహసీల్దార్ కార్యాలయం లో డివై ఎఫ్ఐ ఆధ్వర్యంలో జంగాల కృష్ణయ్య ఆవిష్కరిచారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ..నేడు దేశంలో యువతను పట్టి పిడిస్తున్న మహమ్మారి డ్రగ్స్, గంజాయిని తరిమి కొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డి,వై ఎఫ్ ఐ జిల్లా కమిటీ సభ్యులు మల్లికంటి చంద్రశేఖర్ ,కేవీపీస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కందుకూరి కొటేష్, సీఐటీయూ నాయకులు గురువయ్య, బాల నారాయణ, డి,వై ఎఫ్ ఐ నాయకులు శేఖర్, మహేష్ పుల్లయ్య వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Next Story