యువత చదువుతో పాటు క్రీడల పై దృష్టి పెట్టాలి

by Ratna Kumari |

యువత చదువుతోపాటు క్రీడలపై కూడా దృష్టి పెట్టాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.

యువత చదువుతో పాటు క్రీడల పై దృష్టి పెట్టాలి
X

దిశ, మర్రిగూడ : యువత చదువుతోపాటు క్రీడలపై కూడా దృష్టి పెట్టాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలోని యరగండ్లపల్లి గ్రామంలో సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ క్రీడలు యువకుల మధ్య స్నేహ భావాలు పెంపొందించడమే కాకుండా ఐకమత్యానికి చాటుతాయన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జాతీయస్థాయిలో ఉత్తమ స్థానంలో ఉన్నారని గుర్తు చేశారు. ఆటల్లో గెలుపోటములు సహజమని క్రీడాకారులు స్ఫూర్తిగా కోరుకుంటూ స్నేహభావంతో మెలగాలని సూచించారు. అనంతరం సర్పంచ్ సంతోష్ యాదవ్ మాట్లాడుతూ ముత్యాలమ్మ రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో ప్రతి ఏట మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వ‌హిస్తున్న‌ట్టు ప్రకటించారు. క్రీడాకారులు సహకరించి టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్వర్, జిల్లా నాయకుడు మాజీ ఎంపీటీసీ ఊరు పక్క సరిత నాగేష్, సర్పంచ్లు కమ్మ చిచ్చు వెంకటేష్, ఆమ్బోతు సీతారాం నాయక్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Next Story