- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి యువకుడి మృతి..
కడుపునొప్పి బాధను భరించలేక ఒక యువకుడు పురుగుల మందు తాగి మృతిచెందిన ఘటన చిట్యాల మండలం ఎలికట్టే గ్రామంలో శుక్రవారం జరిగింది.

దిశ, చిట్యాల : కడుపునొప్పి బాధను భరించలేక ఒక యువకుడు పురుగుల మందు తాగి మృతిచెందిన ఘటన చిట్యాల మండలం ఎలికట్టే గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన జక్కలి మచ్చ గిరి (22) కొంతకాలంగా అప్పుడప్పుడు కడుపునొప్పితో బాధపడుతున్నాడు. మందులు వాడుతూ తాత్కాలిక ఉపశమనం పొందుతూ జీవితం కొనసాగిస్తున్నాడు. శుక్రవారం ఉదయం నొప్పి మళ్లీ రావడంతో, పశువులను బావి వద్దకు కట్టేందుకు వెళ్లాడు.
అక్కడ గిరికి నొప్పి తీవ్రంగా పెరిగింది. ఆ బాధను తట్టుకోలేక పొలం వద్ద ఉన్న పురుగుల మందు తాగేశాడు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు గిరిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ పరిస్థితి విషమించి, మార్గమధ్యలోనే మృతి చెందినట్లు ఎస్సై మామిడి రవికుమార్ తెలిపారు. మృతుడి భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






