రైలు కిందపడి యువతి ఆత్మహత్య

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-01-09 16:54:49  IST  )

వలిగొండ మండలంలోని గొల్నెపల్లి గ్రామంలో అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్న యువతి బీబీనగర్ మండల పరిధిలో రైలు కిందపడి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆసల్యంగా వెలుగు చూసింది.

రైలు కిందపడి యువతి ఆత్మహత్య
X

దిశ, వలిగొండ: వలిగొండ మండలంలోని గొల్నెపల్లి గ్రామంలో అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్న యువతి బీబీనగర్ మండల పరిధిలో రైలు కిందపడి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆసల్యంగా వెలుగు చూసింది. రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండల పరిధిలోని గొల్నెపల్లి గ్రామంలో గాదే ప్రవల్లిక (20) అనే యువతి అమ్మమ్మ తాతయ్య సింగపాక యాదమ్మ మల్లయ్య దగ్గర ఉంటు హైదారాబాద్ లో నీ హయత్ నగర్ లోని ఒక ప్రైవేటు కళాశాలలో నర్సింగ్ చదువుతున్న యువతిని కుటుంబ కారణాల వల్ల ఇతరులు మందలించడంతో మనస్తాపానికి లోనైన ప్రవల్లిక గురువారం బీబీనగర్ మండల పరిధిలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకొని పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని మృతురాలి బందువులకు అప్పగించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లుగా రైల్వే పోలీస్ అధికారి కృష్ణారావు తెలిపారు. మృతురాలికి న్యాయం చేయాలని మృతదేహంతో కుటుంబ కారణాలతో ప్రవల్లికను మందలించి మృతికి కారణమైన వ్యక్తి ఇంటి ముందు మృతదేహంతో శుక్రవారం బందువులు నిరసన తెలిపారు. గొల్నెపల్లి గ్రామానికి చెందిన యువతి ప్రవళిక మృతికి కారకులైన వ్యక్తులను చట్ట ప్రకారం శిక్షించి, మృతురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బందువులు ఆందోళన చేపట్టడంతో సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై యుగంధర్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని మృతురాలి బంధువులతో మాట్లాడి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

Next Story