వామ్మో.. ప్రియుడి కోసం యువతి ఏం చేసిందో చూడండి!

by Naveena |

ప్రేమించిన వ్యక్తి వేరొక యువతితో పెళ్లికి అంగీకరించడని మనస్థాపానికి గురైన ఓ యువతి ఉరి వేసుకుని ఆత్యహత్యకు పాల్పడిన సంఘటన మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.

వామ్మో.. ప్రియుడి కోసం యువతి ఏం చేసిందో చూడండి!
X

దిశ ,మర్రిగూడ: ప్రేమించిన వ్యక్తి వేరొక యువతితో పెళ్లికి అంగీకరించడని మనస్థాపానికి గురైన ఓ యువతి ఉరి వేసుకుని ఆత్యహత్యకు పాల్పడిన సంఘటన మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై మునగాల కృష్ణారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని దామర భీమనపల్లి గ్రామానికి చెందిన రాజగోని రజిత(21) అదే గ్రామానికి చెందిన జి నవీన్ అనే అతనిని ప్రేమించింది. రజిత ప్రేమను నవీన్ తల్లిదండ్రులు అంగీకరించలేదు. నవీన్ కు వేరొకరితో పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు ప్రోత్సాహంతో.. నవీన్ వేరే పెళ్లికి అంగీకరించాడు. దీంతో రజిత మనస్థాపానికి గురై ఉదయము 8:30 నిమిషాలకు ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రజిత తండ్రి రాజగోని నరసింహ ఫిర్యాదు మేరకు నవీన్ అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

Next Story