ట్రాక్టర్ నుండి జారిపడి మహిళా కూలీ మృతి..

by Bhanu |

స్లాబ్ పనికి వెళ్లిన మహిళా కూలీ, తిరిగి వస్తూ ట్రాక్టర్ నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందిన విషాదకర ఘటన మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెం గ్రామ సమీప రామస్వామి కుంట వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

ట్రాక్టర్ నుండి జారిపడి మహిళా కూలీ మృతి..
X

దిశ, మఠంపల్లి : స్లాబ్ పనికి వెళ్లిన మహిళా కూలీ, తిరిగి వస్తూ ట్రాక్టర్ నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందిన విషాదకర ఘటన మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెం గ్రామ సమీప రామస్వామి కుంట వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హుజూర్నగర్ మండల పరిధిలోని గోపాలపురం గ్రామానికి చెందిన నవనీత (27) సంవత్సరాలు అనే మహిళ,మఠంపల్లి పరిధిలోని రఘునాథపాలెం గ్రామంలో ఇంటి స్లాబ్ వేసేటందుకు కూలి పనికి వెళ్లిన ఆమె, తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో ట్రాక్టర్ పై కూర్చున్న, ఆమె ట్రాక్టర్ డ్రైవర్ ఒక్కసారిగా టర్నింగ్ రావడంతో డ్రైవర్ కటింగ్ ఇవ్వడంతో ఆమె అదుపుతప్పి ట్రాక్టర్ నుండి జారి పడిపోవడం వల్ల ఈప్రమాదం, చోటుచేసుకుందని తెలిపారు.


ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నవనీతను సహాయకులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందినట్టు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు. మృతదేహాన్ని హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థులు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.


Next Story