- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నెల 31న కాకతీయ కాలువకు నీళ్లు విడుదల
దిశ, తుంగతుర్తి : రబీ సీజన్ కు సంబంధించి శ్రీరాంసాగర్ రెండవ దశ నీటి విడుదల పై నీటి పారుదల శాఖ శుక్రవారం

దిశ, తుంగతుర్తి : రబీ సీజన్ కు సంబంధించి శ్రీరాంసాగర్ రెండవ దశ నీటి విడుదల పై నీటిపారుదల శాఖ శుక్రవారం ఒక స్పష్టమైన ప్రకటన జారీ చేసింది. ఎస్సీ ఐడబ్ల్యూఎమ్ కమిటీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. వారబంది పద్ధతిలో (అంటే వారం విడిచి వారం) ఈనెల 31న ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండి) నుండి కాకతీయ కాలువకు నీటి విడుదల ప్రారంభమవుతుందని ఆ శాఖ స్పష్టం చేసింది. మొదటి జోన్ 146 కి.మీ నుంచి 284 కి.మీ వరకు (అంటే ఎస్సారెస్పీ రెండవ దశ కాలువ ప్రారంభమయ్యే ప్రదేశం) ఏడు రోజులు,రెండవ జోన్ 284 కి.మీ నుంచి 340 కి.మీ వరకు (అంటే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం ప్రగతినగర్ వరకు) 8 రోజులు చొప్పున సాగు నీటి విడుదల జరుగుతుందని తెలిపింది. ఈ లెక్కన రెండవ దశలో ఉన్న మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లోకి నీళ్లు చేరుకున్నాక ఆక్కడి నుండి బయన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లోకి ఎస్సారెస్పీ జలాలు వస్తాయి. ఇక్కడి నుంచి సూర్యాపేట జిల్లాకు విడుదల కానున్నాయి.మొత్తానికి నీటి విడుదల జనవరి మొదటి వారంలో జరగనుంది. మేరకు సాగునీటిని వృధా కాకుండా పొదుపుగా వాడుకుంటూ సహకరించాలని నీటి పారుదల శాఖ రైతులకు విజ్ఞప్తి చేసింది.






