- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలగిరి మున్సిపాలిటీలో వార్డుల రిజర్వేషన్లు ఖరారు
తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 15 వార్డులకు సంబంధించి రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు.

దిశ,తిరుమలగిరి: తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 15 వార్డులకు సంబంధించి రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. సామాజిక న్యాయం, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో ఈ రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. వార్డుల వారీగా రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. 1వ వార్డ్ జనరల్ మహిళకు కేటాయించగా, 2వ వార్డ్ బీసీకి, 3వ వార్డ్ ఎస్సీకి కేటాయించారు. 4వ వార్డ్ బీసీ మహిళకు, 5వ వార్డ్ జనరల్‌కు, 6వ వార్డ్ జనరల్ మహిళకు కేటాయించారు. అలాగే 7వ వార్డ్ బీసీకి, 8వ వార్డ్ జనరల్ మహిళకు, 9వ వార్డ్ జనరల్‌కు కేటాయింపు జరిగింది. 10వ వార్డ్ ఎస్టీకి కేటాయించగా, 11వ వార్డ్ జనరల్ మహిళకు, 12వ వార్డ్ ఎస్సీ మహిళకు రిజర్వ్ చేశారు. మిగతా వార్డుల్లో 13వ వార్డ్ జనరల్ మహిళకు, 14వ వార్డ్ జనరల్‌కు, 15వ వార్డ్ ఎస్సీకి కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ రిజర్వేషన్లతో మున్సిపల్ ఎన్నికలపై రాజకీయ పార్టీల్లో చర్చలు ప్రారంభమయ్యాయి. ఆయా వార్డుల్లో పోటీ చేయనున్న ఆశావహులు తమ వ్యూహాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు.






