- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వీఆర్ఏ మృతి
by Ratna Kumari |
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి అకస్మాత్తుగా వీఆర్ఏ మృతి చెందిన సంఘటన మర్రిగూడ మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.

X
దిశ, మర్రిగూడ : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి అకస్మాత్తుగా వీఆర్ఏ మృతి చెందిన సంఘటన మర్రిగూడ మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దామెర భీమనపల్లి గ్రామానికి చెందిన వీఆర్ఏ (విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్) కోరే లాలయ్య(69) ఉదయం మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చాతిలో నొప్పి ఉందని చెప్పి ఉన్నఫలంగా కుప్పకూలిపోయాడు. వెంటనే వైద్యులు పరీక్షలు చేయగా లో బీపీ తో లాలయ్య మృతి చెందినట్లుగా ధృవీకరించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా లాలయ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. మృతుడు లాలయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు.
Next Story






