- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్న విజన్ ఇన్ఫ్రా
డీటీసీపీ, రేరా లాంటి అనుమతులు లేకున్నా రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. గజాలలో ధర చెప్పి గుంటల్లో అమ్మకాలు చేస్తున్నారు. హైదరాబాదుకు అతి సమీపంలో త్వరపడండి ... వెంటనే ప్లాట్లు కొనుగోలు చేయండి.

దిశ నల్లగొండ బ్యూరో: డీటీసీపీ, రేరా లాంటి అనుమతులు లేకున్నా రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. గజాలలో ధర చెప్పి గుంటల్లో అమ్మకాలు చేస్తున్నారు. హైదరాబాదుకు అతి సమీపంలో త్వరపడండి ... వెంటనే ప్లాట్లు కొనుగోలు చేయండి... అంటూ ""విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్"" సారధ్యంలో '"మధుర వనం"" పేరుతో అక్రమ ఫామ్ లాండ్ దందా దర్జాగా సాగుతుంది.. గుంటలు గుంటలుగా కొండ మల్లేపల్లి తహశీల్దార్ కార్యాలయంలో చేస్తున్న అక్రమ రిజిస్ట్రేషన్లు పై ప్రత్యేక కథనం. నాగార్జునసాగర్-- హైదరాబాద్ జాతీయ రహదారిపై కొండమల్లేపల్లి మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్న కోల్ ముంతల పహాడ్ గ్రామ రెవెన్యూ పరిధిలో ""విజన్ ఇన్ఫ్రా""సారాధ్యంలో మధురవనం పేరుతో సర్వే నెంబర్ 89,90,92, 93లలో 243 ఫామ్ ప్లాట్స్ వెంచర్ ఏర్పాటు చేశారు.
మాయ మాటలు చెప్పి....?
రియల్ ఎస్టేట్ వ్యాపారులు కస్టమర్లకు ప్లాటు కొనుగోలు చేసే వరకు మాయ మాటలు చెప్పి తమ బుట్టలోవేసుకుంటున్నారు. ప్రభుత్వ సెలవు రోజు వచ్చిందంటే చాలు హైదరాబాదు , లేదా ముఖ్యమైన నగరాల నుంచి కస్టమర్లను వెంచరుకు తీసుకువచ్చి విందు భోజనం పెట్టి, ఆఫర్లు వివరించి ప్లాట్లు కొనుగోలు చేసే వరకు మాయమాటలు చెప్పి మరి ప్లాట్లు బుక్ చేయిస్తున్నారు. ఒక సంస్థలో పనిచేస్తున్న వారిలో ఒకరిని తమ వైపు తిప్పుకొని ఆఫర్లు ఇచ్చి ప్లాట్ కొనుగోలు చేయించి మజ్జిక చేసుకుంటాడు ఆ తర్వాత మిగతా వాళ్ళందర్నీ ప్లాట్లు కొనుగోలు చేసేలా చేస్తారు. వీకెండ్ కదా అలా ఒకసారి సరదాగా వెంచర్ కి వెళ్లి వద్దాం ...జాలీగా ఉంటుంది... అన్ని రకాల విందులు వాళ్లే చూసుకుంటారని మాయ ముచ్చట్లు చెప్తారు. అయితే ఇలా మాయమాటలకు మోసపోయిన వాళ్ళు ఎక్కువగా హైదరాబాదులో ఉన్నటువంటి సాఫ్ట్ వేరు ఇతర ప్రభుత్వ శాఖల్లో పని చేసే అధికారులు, ఉన్నతాధికారులు ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోతున్నారు. అలా మోసపోయిన చాలామంది బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు.
ఆశపడి కొంటున్నారు సరే.....?
ఉన్నతాధికారుల నుంచి సామాన్య ప్రజల వరకు భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగపడుతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారుల ద్వారా ఏర్పాటు చేసిన వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. కనీసం ఆ వెంచర్ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి ఉందా.... లేదా... అని కనీస సమాచారం తెలుసుకోవడం లేదు. తన తోటి ఉద్యోగి, బంధువు స్నేహితులు చెప్పారని లక్షలు పెట్టి ప్లాట్లు కొంటున్నారు. కానీ నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత ఆ ప్లాట్ లో ఇల్లు కట్టుకోవడానికి గ్రామపంచాయతీ ,మున్సిపాలిటీ అనుమతి ఉండదు.. అనుమతి లేకపోతే బ్యాంకు నుంచి రుణం రాదు.ఒకవేళ ప్లాట్ అమ్ముకుందామంటే ఆరోజు పరిస్థితి రియల్ భూమ్ ఉంటుందో లేదో తెలియదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం సరిగ్గా లేకపోతే మనం కొనుగోలు చేసిన ధర కూడా రాకపోవచ్చు. అలాంటి పరిస్థితులలో మనకు ప్లాటు కొనుగోలు చేయించిన మార్కెటింగ్ వారు ఎక్కడ కనిపించరు. వెంచర్ యజమాని అడిగితే ప్లాట్లకు ఇప్పుడు ధరలు లేవు.. మీరు అనుకున్న ధర రాదు... మేము చెప్పిన ధరకు ఇస్తే ఇవ్వండి లేకపోతే మీ ఇష్టం అని చెప్పి చేతులు దులుపుతారు. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వ అనుమతి లేకుండా కొనుగోలు చేయడం వల్ల కస్టమర్లకు తీవ్రంగా నష్టం. అందుకే తస్మాత్ జాగ్రత్త.






