- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పులు తీర్చాలని బాధితుల ఆందోళన
తమ అప్పులు తీర్చాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటామంటూ బాధితులు ఆందోళన చేసిన సంఘటన మండల పరిధిలోని జెర్రిపోతులగూడెంలో చోటు చేసుకుంది.

దిశ, చిలుకూరు: తమ అప్పులు తీర్చాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటామంటూ బాధితులు ఆందోళన చేసిన సంఘటన మండల పరిధిలోని జెర్రిపోతులగూడెంలో చోటు చేసుకుంది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెం కి చెందిన తానం రవీందర్ రెడ్డి గ్రామంలో కొంత మంది దగ్గర సుమారు ₹ కోటి అప్పులు చేశాడు. అప్పుల బాధతో నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరోజు అప్పులు ఇచ్చిన వారు ఆందోళన చేయడంతో మృతుని తండ్రి అమృతా రెడ్డి నెమ్మదిగా అప్పులు తీర్చుతామని హామీ ఇవ్వడంతో సద్దుమణిగారు. నాలుగు నెలలైనా తమ అప్పులు తీర్చకపోవడంతో బాధితులు గురువారం అమృతా రెడ్డి ఇంటి ఎదుట టెంట్ వేసి ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయకపోతే తామూ చస్తామంటూ పురుగుమందుల డబ్బాలతో ఆందోళన చేశారు. పరిస్థితి గమనించిన జేపీగూడెం, బేతవోలుకు చెందిన కొందరు పెద్దలు జోక్యం చేసుకుని పెద్ద మనుషుల ద్వారా సమస్యను పరిష్కరించుకుందాం అని బాధితులను శాంతపరిచారు. వచ్చే ఆదివారం వారు ఈ సమస్యకు పరిష్కారం సూచించనట్టు సమాచారం.






