తాగకపోయినా తాగినట్టు బిల్లు.. వెంకటరమణ బార్ బాగోతం బట్టబయలు..!

by Bhanu |

నల్లగొండ క్లాక్ టవర్ సమీపంలోని శ్రీ వెంకటరమణ బార్ రెస్టారెంట్‌లో మద్యం ప్రియులపై బిల్లుల దోపిడీ వెలుగులోకి వచ్చింది.

తాగకపోయినా తాగినట్టు బిల్లు.. వెంకటరమణ బార్ బాగోతం బట్టబయలు..!
X

దిశ, నల్లగొండ: నల్లగొండ క్లాక్ టవర్ సమీపంలోని శ్రీ వెంకటరమణ బార్ రెస్టారెంట్‌లో మద్యం ప్రియులపై బిల్లుల దోపిడీ వెలుగులోకి వచ్చింది. ఇక్కడ తాగిన మద్యం కన్నా, తాగనిది ఎక్కువగా బిల్లుల్లో చూపడం పరిపాటిగా మారినట్లు చెబుతున్నారు. తాగిన మైకంలో కస్టమర్లు గమనించరనుకుంటూ, అక్రమంగా అదనపు బిల్లు వసూలు చేయడం ఆ బార్ నిర్వాహకుల కొత్త నైపుణ్యంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

నిన్న రాత్రి ముగ్గురు స్నేహితులు ఆ బార్‌కి వెళ్లి మద్యం, ఫుడ్ ఆర్డర్ చేశారు. అనంతరం వచ్చిన బిల్లును చూసి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. తాము తీసుకున్నవి కాకుండా అదనపు లిక్కర్‌కి కూడా బిల్లు వేసినట్లు గుర్తించారు. అసలు బిల్లు రూ.2528 కాగా, వారి చెత్త బిల్లు రూ.3148! నిలదీయగా బేరర్ పెన్‌తో సరిచేసి మళ్లీ బిల్లు ఇచ్చిన ఘటనపై బాధితులు దిశ‌కి వివరించారు.

తాగిన వారికి ఇది తెలుసకపోయినా, జాగ్రత్తగా గమనించిన వారు మాత్రమే దీనిని ప్రశ్నించగలుగుతున్నారు. మద్యం ధరలు, ఫుడ్ రేట్లు సామాన్యుడికి అసాధ్యంగా ఉండటం, అధికారుల నిర్లక్ష్యం ఈ దోపిడీకి దన్నుగా మారాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు స్పందించిన ఎక్సైజ్ సీఐ ప్రసాద్ మాట్లాడుతూ, అధిక ధరలు, అక్రమ బిల్లులపై చర్యలు తప్పవని, శ్రీ వెంకటరమణ బార్‌పై దర్యాప్తు జరిపి అవసరమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Next Story