- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వలిగొండలో పాదముద్రల కలకలం..పులివా, చిరుతవా?
వలిగొండ మండలం పడమటివారి గూడెంలో ఇటీవల రైతులు, గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. కారణం అక్కడి పత్తి పొలాల్లో గత రెండు రోజులుగా గుర్తు తెలియని క్రూర జంతువుల

దిశ, వలిగొండ : వలిగొండ మండలం పడమటివారి గూడెంలో ఇటీవల రైతులు, గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. కారణం అక్కడి పత్తి పొలాల్లో గత రెండు రోజులుగా గుర్తు తెలియని క్రూర జంతువుల పాదముద్రలు కనిపించడమే. ఇవి పులి లేదా చిరుత పులి పాదముద్రలుగా భావించిన రైతులు వెంటనే సమాచారం ఫారెస్ట్ అధికారులకు అందించారు.
సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు మంగళవారం అక్కడికి చేరుకుని పాదముద్రలు, గోర్ల చలనాలను పరిశీలించారు. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం ఇవి పులి లేదా చిరుత పులివి కాకుండా హైనా లేదా నక్కకు చెందినవే కావచ్చని అభిప్రాయపడ్డారు.అయితే ఇప్పటికీ ఆ జంతువు ప్రత్యక్షంగా కనిపించకపోవడంతో గ్రామస్తులు, వ్యవసాయ కూలీలు నిర్భయంగా ఉండలేకపోతున్నారు. చుట్టుపక్కల పొలాల్లో పనులు చేయడానికి కూడా కొంత భయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిశీలనలో ఫారెస్ట్ శిక్షణాధికారి రాగ్య నాయక్, రైతు అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






