- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజీవ్ యువ వికాసం నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు తీపి కబురుగా శుభవార్త చెప్పింది.

దిశ ,తిరుమలగిరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు తీపి కబురుగా శుభవార్త చెప్పింది. స్వయం ఉపాధి పథకం (సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీం) కోసం దరఖాస్తులు ప్రారంభించింది. రాజీవ్ యువ వికాసం కింద అర్హులైన వారికి నాలుగు లక్షల రూపాయలు ఇవ్వనుంది. ఎస్సీ,ఎస్టి,బిసి, మైనారిటీ వర్గాలకు చెందిన వారు ఈ స్కీం కోసం ఆన్లైన్ ద్వారా మార్చి 17 తారీఖు నుండి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని,అర్హులైన వారికి 60% నుంచి 80%శాతం సబ్సిడీ వర్తిస్తుందని, మామిడాల గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు గురించి సాంస్కృతిక సారథి సూర్యాపేట జిల్లా టీం లీడర్ పాలకుర్తి శ్రీకాంత్ సమావేశంలో మాట్లాడారు.
అదేవిధంగా వేసవికాలంలో ఎండ తీవ్రతపై, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు కళారూపాల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాబృందం సభ్యులు ఈర్ల సైదులు,గడ్డం ఉదయ్,వెన్నెల నాగరాజు,మాగి శంకర్,పాక ఉపేందర్,మేడిపల్లి వేణు,మద్దిరాల మంజుల,సిరిపంగి రాధ,నెమ్మాది స్రవంతి,పోతరాజు శిరీష,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






