మహాత్మా మాకేందీ పరీక్ష?

by Disha Web Desk 12 |
మహాత్మా మాకేందీ పరీక్ష?
X

నల్లగొండ ఉమ్మడి జిల్లాలో అతి ప్రతిష్టాత్మకమైన ఎంజీ యూనివర్సిటీలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఎంతో మంది మేధావులు, విద్యార్థులకు వేదిక మారి వారి జీవితాలను మలుపుతిప్పిన యూనివర్సిటీలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షా ఫలితాలు విడుదలలో గందరగోళం నెలకొన్నది. శుక్రవారం వీసీ 3, 5వ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసి యూనివర్సిటీ వెబ్ సైట్‌లో పెట్టారు. ఫలితాలు విడుదల చేసిన గంటల వ్యవధిలోనే సైట్‌లో కనిపించకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అంతేకాక డిగ్రీ 3వ సెమిస్టర్‌లో 10,775మంది పరీక్ష రాయగా 7,791మంది ప్రమోట్ అయ్యారు.

5వ సెమిస్టర్‌ పరీక్షకు 9013మంది విద్యార్థులు హాజరు కాగా, 6,163మంది విద్యార్థులు ప్రమోట్ కావడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్టు గౌడ్ లైన్స్ కు విరుద్ధంగా యూనివర్సిటీ అధికారులు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పరీక్షల విభాగంలో ఆరేళ్లుగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారి కుర్చీలో ఒక్కరే పాతుకుపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన చెప్పిందే వేదం.. చేసిందే శాసనం అన్న తీరు నెలకొన్నదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇంతమంది విద్యార్థులు ప్రమోట్ కావడంపై ఆ విభాగం అధికారుల నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

దిశ, నల్లగొండ : నల్లగొండ ఉమ్మడి జిల్లాలో అతి ప్రతిష్టాత్మకమైంది మహాత్మ గాంధీ యూనివర్సిటీ. ఎంతో మంది మేధావులు, విద్యార్థులకు వేదిక మారి వారి జీవితాలను మలుపుతిప్పింది. అటువంటి యూనివర్సిటీలో ప్రస్తుతం సమస్యలు రాజ్యమేలుతున్నాయి. యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాల విద్యార్థుల పరీక్ష ఫలితాలు విడుదలలో గందరగోళం నెలకొన్నది. ఫలితాలు విడుదల చేసిన గంటల వ్యవధిలోనే సైట్‌లో ఫలితాలు కనిపించకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు.

శుక్రవారం మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ గోపాల్ రెడ్డి డిగ్రీ 3, 5వ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేశారు. విద్యార్థులు పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ వెబ్ సైట్‌లో చూసుకోవాలని తెలిపారు. డిగ్రీ 3వ సెమిస్టర్‌లో 10,775మంది పరీక్ష రాయగా 2966మంది మాత్రమే పాస్ అయ్యారు. 7,791మంది ప్రమోట్ అయ్యారు. డిగ్రీ 5వ సెమిస్టర్‌ పరీక్షకు 9013మంది విద్యార్థులు హాజరు కాగా 2,846 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 6,163మంది విద్యార్థులు ప్రమోట్ కావడం గమనార్హం.

పరీక్షల విభాగం అధికారిగా ఆరుళ్లుగా ఒక్కరే..

ఏ యూనివర్సిటీ అయిన కొన్ని విధివిధానాలను కలిగి ఉంటుంది. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అది కీలకమైన పరీక్షల విభాగంలో ఆరేళ్లుగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారి కుర్చీలో ఒక్కరే పాతుకుపోయారు. దీంతో ఆయన చెప్పిందే వేదం.. చేసిందే శాసనం అన్న తీరు యూనివర్సిటీలో నెలకొన్నది. ఈ విషయమై ఉన్నత విద్యా శాఖ దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. యూనివర్సిటీ పరిధిలో ఇంత మంది విద్యార్థులు ప్రమోట్ కావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పరీక్ష పత్రాల మూల్యకనం సరిగ్గా చేయట్లేదా..? లేక విద్యార్థులు పరీక్షలు బాగా రాయట్లేదా..? అనేది తేలడం లేదు. ఈ క్రమంలో ఆ విభాగం అధికారుల నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

వెబ్ సైట్‌లో కనిపించని పలితాలు..

వీసీ పలితాలు విడుదల చేసినా యూనివర్సిటీ వెబ్ సైట్‌లో మాత్రం రెండు గంటలు మాత్రమే ఫలితాలు కనిపించాయి. ఆ తర్వాత నాట్ ఫౌండ్ అని చూపిస్తోందని విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా విద్యార్థులకు ఇటువంటి అనుభవం ఎదురైంది. గతంలో ఒక సబ్జెక్ట్‌లో కొంతమంది విద్యార్థులు ఫెయిల్ అయ్యి రివాల్యుయేషన్ పెట్టుకుంటే పలువురు విద్యార్థులు పాసైనట్లు తెలిసింది. విద్యార్థుల జీవితాలతో మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరీక్షల విభాగం చెలగాటం ఆడుతోందని విద్యార్థులు వాపోతున్నారు. పరీక్షల్లో ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు పరీక్ష పత్రాల మూల్యకనంలో జరిగిన తప్పులా...? లేక విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఫలితాల వెల్లడిలో గందరగోళం..

యూనివర్సిటీలో పరీక్షలు రాసిన విద్యార్థులు ఫెయిలైన విద్యార్థులు రివాల్యుయేషన్ పెట్టుకుంటే పాసైన సందర్భాలు చాలానే ఉన్నాయి. మూల్యాంకనం సరిగ్గా చేస్తే ఇటువంటి పొరపాట్లు ఉండవు కదా అని విద్యార్థులు వాపోతున్నారు. ఇలా పరీక్ష ఫలితాల్లో ఫెయిలై రివాల్యుయేషన్‌లో పాస్ అవుతున్నా ఈ మధ్య సమయంలో విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

ఆన్ లైన్ మూల్యాంకనమైనా తప్పులే..

ప్రస్తుతం ఆన్ లైన్ విధానంలో పరీక్ష పత్రాల మూల్యాంకనం జరుగుతున్నా ఇంత పెద్దఎత్తున విద్యార్థులు ఫెయిల్ కావడానికి కారణాలు ఏంటనే సందేహం వ్యక్తం అవుతోంది. ఫెయిల్ అయినా వారు రీ వాల్యూయేషన్ పెట్టుకుంటే పాస్ అవుతుండడం ఆశ్చర్యంగా ఉంది. ఇటువంటి తప్పిదాలతో మూల్యాంకనం చేసిన లెక్చరర్ల పైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ గాలికేనా..?

దేశంలో అన్ని యూనివర్సిటీలు ఒక లెక్క మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఒక లెక్క అన్న చందంగా మారింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి మూడేళ్లకొసారి ఆయా విభాగాల అధిపతులు మారాల్సి ఉంటుంది. కానీ ఆరేళ్లు గడుస్తున్నా ఒక్కరే పరీక్షల విభాగం అధికారిగా ఎలా ఉంటారనేది అంతుపట్టడం లేదు.

యూనివర్సిటీలో ఒకే విభాగం అధికారిగా ఎక్కువ రోజులు కొనసాగితే అవినీతికి పాల్పడే అవకాశం లేకపోలేదు. కావున తక్షణమే మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై ఉన్నత విద్యాశాఖ అధికారులు, యూనివర్సిటీ ఉన్నతాధికారులు సమాలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు.

Next Story

Most Viewed