- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్సైల బదిలీలు..
by Batti.Sumithra |
అర్వపల్లి ఎస్సైగా పనిచేస్తున్న ఎస్కే.యాకూబ్ వీఆర్ సూర్యాపేటకు బదిలీ అయ్యారు. కాగా, ఇక్కడికి సూర్యాపేట వన్ టౌన్ ఎస్సైగా పనిచేస్తున్న సీహెచ్.బాలకృష్ణ నియమితులయ్యారు.

X
దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం) : అర్వపల్లి ఎస్సైగా పనిచేస్తున్న ఎస్కే.యాకూబ్ వీఆర్ సూర్యాపేటకు బదిలీ అయ్యారు. కాగా, ఇక్కడికి సూర్యాపేట వన్ టౌన్ ఎస్సైగా పనిచేస్తున్న సీహెచ్.బాలకృష్ణ నియమితులయ్యారు. అదే విధంగా తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం ఎస్సై పీ.వెంకట్ రెడ్డి వీఆర్ సూర్యాపేటకు బదిలీ కాగా సీసీఎస్ నల్లగొండలో పనిచేస్తున్న ఎం.ఐలయ్య ఇక్కడకు వచ్చారు.
తిరుమలగిరి ఎస్సైగా పనిచేస్తున్న కే.సత్యనారాయణ కూడా వీఆర్ సూర్యాపేటకు బదిలీ కావడంతో ఇక్కడికి నార్కట్ పల్లి టు ఎస్సైగా పనిచేసే వీ.సురేష్ నియామకం అయ్యారు. నూతనకల్ ఎస్సై జే.సైదులు వీఆర్ సూర్యాపేటకు బదిలీ కాగా, ఆయన స్థానంలో సూర్యాపేట టూ టౌన్ ఎస్సైగా పనిచేస్తున్న ఐ.మహేంద్రనాథ్ ను బదిలీ చేస్తూ యాదాద్రి జోన్ డీఐజీ ఉత్తర్వులు వెలువరించారు.
Next Story






