- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నలిస్టుల శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి : టీయూడబ్ల్యూజే
జర్నలిస్టుల శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి కోరారు.

దిశ, చిట్యాల : జర్నలిస్టుల శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి కోరారు. బుధవారం చిట్యాల పట్టణంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 23, 24 తేదీల్లో హైదరాబాద్ లోని నాంపల్లి మీడియా అకాడమి ఆడిటోరియంలో ఈ శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయిన తెలిపారు. జర్నలిజం వృత్తిలో నైపుణ్యత సాధించేందుకు గాను ఈ శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తూనే వృత్తిపరంగా మెలకువలు నేర్పించడం కోసం ఈ శిక్షణ తరగతులను మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్ తో పాటు ఇంటి స్థలం, ఇల్లు, హెల్త్ కార్డులు అందించడం కోసం టియుడబ్ల్యూజే (ఐజెయు) నిరంతరంగా కృషి చేస్తుందన్నారు. ఈ సమావేశంలో టియుడబ్ల్యూజే జిల్లా నాయకులు పులిమామిడి మహేంద్ర రెడ్డి, దోటి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్ల బయన్న, అధ్యక్షుడు మెండే వెంకన్న, ప్రధాన కార్యదర్శి పోకల కరుణాకర్, కోశాధికారి చెరుపల్లి శ్రీనివాస్, మిర్యాల ప్రకాష్, అమరోజు వెంకట్ పాల్గొన్నారు.






