- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దోచుకున్న పంచాయతీ కార్యదర్శి.. పనులు చేయకున్నా డబ్బులు డ్రా
మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామ పంచాయతీలో గతంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన అధికారిణి అక్రమాలు చిట్టా పెద్దదిగానే ఉంది. రోడ్లు, డ్రైనేజీలు, మట్టి పనులు వంటి పనులకు నిధులు కేటాయించినప్పటికీ అవి పూర్తిగా జరగలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామ పంచాయతీలో గతంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన అధికారిణి అక్రమాలు చిట్టా పెద్దదిగానే ఉంది. రోడ్లు, డ్రైనేజీలు, మట్టి పనులు వంటి పనులకు నిధులు కేటాయించినప్పటికీ అవి పూర్తిగా జరగలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల పనులు ప్రారంభించకముందే పూర్తి అయినట్లు రికార్డుల్లో చూపించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ చేయించకుండానే రిజిస్ట్రేషన్ చేసినట్లుగా ,అట్లాగే ఇన్సూరెన్స్ కూడా కట్టకుండానే కట్టినట్లు చేయించి చెక్కులు డ్రా చేసిన ఘనత ఆ పంచాయతీ కార్యదర్శికి ఉంది. గ్రామపంచాయతీలో ప్రభుత్వ భూములను ప్లాట్లుగా మార్చి అక్రమంగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. ఖాళీ స్థలాలలో గృహాలు ఉన్నట్లుగా చిత్రీకరించి వాటికి ధ్రువీకరణలు దాదాపు 70కి పైగా జారీ చేసి పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెతుతున్నాయి. గ్రామ అభివృద్ధి పేరుతో విడుదలైన నిధులు సరైన విధంగా వినియోగించలేదని గ్రామస్తులు ఆరోపిస్తూ గతంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. -దిశ, మిర్యాలగూడ రూరల్
దిశ, మిర్యాలగూడ రూరల్ : ఆ పంచాయతీ కార్యదర్శి రూటే సపరేటు. అవినీతిలో ఆమెదిట్టా .చేయని పనులు చేసినట్టుగా గవర్నమెంట్ భూమిని ఇంటి స్థలాలుగా చేయడంలో ఆమెకు ఆమె సాటి. ఇంతకు ఆమె ఎవరు ఏం చేస్తారు అనేది వార్తలో చూద్దాం. మిర్యాలగూడ మండలంలోని అవంతిపురం గ్రామ పంచాయతీలో గతంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన అ కార్యదర్శి చేసిన నిధుల దుర్వినియోగంపై తీవ్ర వివాదం నెలకొంది. గ్రామ అభివృద్ధి పేరుతో విడుదలైన నిధులు సరైన విధంగా వినియోగించలేదని గ్రామస్తులు ఆరోపిస్తూ గతంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో గ్రామంలోని పలు అభివృద్ధి పనులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, వాస్తవంగా పనులు జరగలేదని పేర్కొన్నారు.
పనులు లేకుండానే బిల్లులు క్లియర్ చేసినట్లు ఆరోపణలు
గ్రామంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులు కేవలం పత్రాలకే పరిమితమయ్యాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, మట్టి పనులు వంటి పనులకు నిధులు కేటాయించినప్పటికీ అవి పూర్తిగా జరగలేదని వారు చెబుతున్నారు. కొన్ని చోట్ల పనులు ప్రారంభించకముందే పూర్తి అయినట్లు రికార్డుల్లో చూపించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ చేయించకుండానే రిజిస్ట్రేషన్ చేసినట్లుగా ,అట్లాగే ఇన్సూరెన్స్ కూడా కట్టకుండానే కట్టినట్లు చేయించి చెక్కులు డ్రా చేసిన ఘనత ఆ పంచాయతీ కార్యదర్శికి ఉంది. దీనివల్ల ప్రభుత్వ నిధులు భారీగా దుర్వినియోగం అయ్యాయని గ్రామస్తులు అంటున్నారు. నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
నకిలీ సంతకాలు, ధృవీకరణ పత్రాలపై తీవ్ర అనుమానాలు
గ్రామ పంచాయతీకి సంబంధించిన ధృవీకరణ పత్రాల్లో నకిలీ సంతకాలు చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రజల పేర్లతో వారి అనుమతి లేకుండానే పత్రాలు తయారు చేసి వాటిపై గతంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శుల సంతకాలు ఫోర్జరీ చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంతమంది గ్రామస్తులు తమ పేర్లు ఉపయోగించారని తెలిసి ఆశ్చర్యానికి గురయ్యారని చెబుతున్నారు. పంచాయతీ రికార్డుల్లో చూపించిన పనులు వాస్తవంగా జరగలేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పత్రాల నిజానిజాలను నిర్ధారించేందుకు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడమే కాకుండా నకిలీ పత్రాలు సృష్టించడం పెద్ద నేరమని వారు అంటున్నారు. ఈ వ్యవహారంలో ఎవరెవరు పాల్గొన్నారు అనే విషయాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
గ్రామపంచాయతీలో ప్రభుత్వ భూములను ప్లాట్లుగా మార్చి అక్రమంగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేసింది... ఖాళీ స్థలాలలో గృహాలు ఉన్నట్లుగా చిత్రీకరించి వాటికి ధ్రువీకరణలు దాదాపు 70 జారీ చేసి పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ప్రజలు వెలువెతుతున్నాయి. . ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఇన్సూరెన్స్ కట్టినట్లు చెక్కులు డ్రా చేసింది. గ్రామపంచాయతీ నిర్వహణ పేరుతో ప్రతి నెల లక్షల్లో నిధులను దుర్వినియోగపరిచింది. ఈమె చేసిన అవినీతి అధికారులకు తెలిసినప్పటికీ నిశ్శబ్దం వహిస్తున్నారు. అ కార్యదర్శి కి అధికారుల అండదండలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రామంలో జరుగుతున్న అక్రమాలపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో నిధులు మాయమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు కలిసి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల నుంచి ఇప్పటివరకు స్పష్టమైన స్పందన లేకపోవడం గమనార్హం. గ్రామస్తులు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారుల వైఖరిలో మార్పు కనిపించలేదని వారు అంటున్నారు.






