చికిత్స పొందుతూ వ్య‌క్తి మృతి

by Ratna Kumari |

దిశ, చిలుకూరు : రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన

చికిత్స పొందుతూ వ్య‌క్తి మృతి
X

దిశ, చిలుకూరు : రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బేతవోలుకు చెందిన దేశబోయిన శ్రీనివాస్ (55) ఇటీవల బేతవోలు నుంచి జెర్రిపోతులగూడెం రోడ్డు పై వెళ్తుండ‌గా.. ముందుగా వెళుతున్న బైక్ ను గమనించక కంగారులో కింద పడిపోయాడు. ఆ క్రమంలో అతని తలకు బలమైన గాయాలయ్యాయి. అతన్ని వెంటనే చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి పంపారు. అక్కడి నుంచి సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి పంపగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందాడు. మృతుని కుమార్తె వీణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

Next Story