- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్కూల్‌కు రాకున్నా జీతం.. ఏడాదికాలంగా ఉపాధ్యాయురాలి తీరు.. చర్యలకై టీఎస్‌యుటిఎఫ్ డిమాండ్
చందంపేట మండలంలోని పోలేపల్లి కాంప్లెక్స్ పరిధిలో కుర్రతండకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు గత ఏడాది రోజులుగా పాఠశాలకు హాజరుకాకపోయినా, నెలనెలా జీతం తీసుకుంటున్నట్లు టీఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా కమిటీ ఆరోపించింది.

దిశ,నల్లగొండ: చందంపేట మండలంలోని పోలేపల్లి కాంప్లెక్స్ పరిధిలో కుర్రతండకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు గత ఏడాది రోజులుగా పాఠశాలకు హాజరుకాకపోయినా, నెలనెలా జీతం తీసుకుంటున్నట్లు టీఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా కమిటీ ఆరోపించింది.ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) మరియు కలెక్టర్‌కు ఇప్పటికే రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు యూనియన్ నేతలు వెల్లడించారు.ఫిర్యాదు మేరకు డీఈవో విచారణ అధికారిని నియమించగా, ఉపాధ్యాయురాలు విధులకు హాజరు కాలేదన్న విషయం రుజువైనట్లు సమాచారం.
అయితే, విచారణలో సత్యం బయటపడినా ఇప్పటికీ సంబంధిత ఉపాధ్యాయురాలిపై, అలాగే జీతం చెల్లింపులో బాధ్యత వహించిన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు మరియు మండల విద్యాధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని యుటిఎఫ్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతామని టీఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బక్క శ్రీనివాస్ చారి, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం హెచ్చరించారు.






