ఆటో డ్రైవర్ మృతిపై అనుమానం.. భార్య ఫిర్యాదు

by Nallavelli.Anjaneyulu |

దిశ, చిట్యాల : చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామ శివారులో జాతీయ రహదారి 65 పక్కన గల కాలువలో ఆటో పల్టీ కొట్టి వ్యక్తి మృతి చెందిన సంఘటన పై మృతుని భార్య అనుమానం వ్యక్తం చేస్తూ

ఆటో డ్రైవర్ మృతిపై అనుమానం.. భార్య ఫిర్యాదు
X

దిశ, చిట్యాల : చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామ శివారులో జాతీయ రహదారి 65 పక్కన గల కాలువలో ఆటో పల్టీ కొట్టి వ్యక్తి మృతి చెందిన సంఘటన పై మృతుని భార్య అనుమానం వ్యక్తం చేస్తూ శనివారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చిట్యాల మండలంలోని పేరేపల్లి గ్రామానికి చెందిన అంతటి సీనయ్య (39) గత కొద్దిరోజులుగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడు బ్రతుకుతెరువు కోసం గత 5 రోజుల క్రితం తన భార్య స్వగ్రామమైన చండూరు మండలం బంగారి గడ్డ గ్రామానికి వెళ్లి అక్కడ ఒక ఇంట్లో కిరాయికి ఉండి ఆటో నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఈనెల 21వ తేదీ శుక్రవారం ఉదయం మృతుడు తన భార్యతో మునుగోడుకు ఆటో కిరాయి నిమిత్తం వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం రాత్రి 8 గంటలైనా ఇంటికి రాకపోయేసరికి కంగారుపడిన మృతుని భార్య ఫోన్ చేయగా మరి కాసేపట్లో ఇంటికి వస్తున్నానని చెప్పి రాత్రి వరకు ఇంటికి రాకపోయేసరికి ఆందోళనతో పేరేపల్లి లోని తన బంధువులకు ఫోన్ చేయగా మృతుడు అక్కడికి రాలేదని చెప్పడంతో తీవ్ర ఆందోళనకు గురైంది. ఆదివారం ఉదయం 10 గంటలకు మృతుని సోదరుడు ఫోన్ చేసి పెద్దకాపర్తి గ్రామ శివారులో గల కాలువలో ఆటో తో సహా పడి తీవ్రంగా గాయపడి మృతి చెంది ఉన్నాడని మృతుని భార్యకు తెలియజేశాడు. దీంతో మృతురాలు భార్య రజిత భర్త మృతి పై తీవ్ర అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసిన‌ట్టు ఎస్సై రవికుమార్ వెల్ల‌డించారు.

Next Story