సూర్యాపేట జిల్లా వాసికే..జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

by velandi.Saikiran |

కేంద్ర ప్రభుత్వం.. ప్రతి ఏటా ప్రకటించే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సూర్యాపేట జిల్లాకు వరించింది.

సూర్యాపేట జిల్లా వాసికే..జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
X

దిశ, సూర్యాపేట,పెన్ పహాడ్: కేంద్ర ప్రభుత్వం.. ప్రతి ఏటా ప్రకటించే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సూర్యాపేట జిల్లాకు వరించింది. రాష్ట్రవ్యాప్తంగా 150 మంది ఉపాధ్యాయులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు చేసుకోగా, వారిలో సూర్యాపేట జిల్లాకు చెందిన మారం పవిత్రను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా 2025 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయురాలుగా మారం పవిత్ర పనిచేస్తున్నారు.


కేంద్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు కోరిన నేపథ్యంలో ఆమె అవార్డుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా గుర్తింపు రావడంపై మారం పవిత్ర స్పందించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏకైక కేంద్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. సూర్యాపేట జిల్లాకే కేంద్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం పట్ల జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హర్షం వ్యక్తం చేశారు. కాగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 45 మంది టీచ‌ర్లను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.

Next Story