- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కల్పించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : విద్యార్థులు గాంజా వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : విద్యార్థులు గాంజా వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన మత్తు మందుల నివారణ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలోని అన్ని బాలుర రెసిడెన్షియల్ పాఠశాలల్లో గాంజా వంటి మత్తు పదార్థాలను విద్యార్థులు వినియోగించకుండా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. పోలీస్, పాఠశాల ప్రధానోపాధ్యాయుల సమన్వయంతో షెడ్యూల్ ని రూపొందించి మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆయా సొసైటీలకు సంబంధించిన విద్యా సంస్థల్లో మత్తుపదార్థాలపై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని, మండల వారీగా ఒక షెడ్యూల్ తయారుచేసి స్థానిక ఇన్ స్పెక్టర్, ప్రధానోపాధ్యాయుల సహకారంతో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
సంబంధిత సంక్షేమ శాఖల రీజినల్ కో-ఆర్డినేటర్లు, ప్రిన్సిపాల్స్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. నార్కట్ పల్లి సమీపంలో ఉన్న కామినేని ఆసుపత్రిలోని డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ను ఆదేశించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ జనవరి 26 న పాఠశాల విద్యార్థులతో మత్తు పదార్థాల నివారణ పై ప్రత్యేకంగా రూపకం ప్రదర్శించే విధంగా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. అలాగే బాలుర రెసిడెన్షియల్ పాఠశాలల్లో మత్తు పదార్థాలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, జిల్లాలో పాఠశాలల్లో మత్తు పదార్థాలపై నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో కళాజాత బృందాలను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. అలాగే ఆయా పాఠశాల్లో నిర్వహించే కార్యక్రమాలు విద్యార్థులను ఆకట్టుకునే విధంగా నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భిక్షపతి, గిరిజన, సాంఘిక, బిసి సంక్షేమ శాఖల అధికారులు చత్రు నాయక్, శశికళ, సంధ్య, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.






