రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైన‌ పుల్లెంల పాఠశాల విద్యార్థులు

by Nallavelli.Anjaneyulu |

నల్లగొండ లో జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పుల్లంల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక‌య్యారు.

రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైన‌ పుల్లెంల పాఠశాల విద్యార్థులు
X

దిశ, చండూరు: ఈ నెల 2, 3 వ తేదీల‌లో నల్లగొండ లో జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పుల్లంల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక‌య్యారు. తొమ్మిదవ తరగతికి చెందిన E పూజిత సేంద్రియ వ్యవసాయం పై, K శ్రీ వాణి సౌరశక్తి వినియోగంతో పత్తి తీయుటకు చెందిన విద్యార్థుల ఎగ్జిబిట్లు రాష్ట్ర స్థాయికి ఎంపిక అయ్యారు. ఈ నెల 7, 8 తేదీల్లో కామారెడ్డి లో ఈ వైజ్ఞాని ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొన‌డానికి వెళ్తున్న‌ విద్యార్థులను, వారిని ప్రోత్సాహించిన ఉపాధ్యాయులను సోమవారం పాఠశాలలో గ్రామ సర్పంచ్ ముక్కామల్ల వెంకన్న ఘనంగా సత్కరించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు విద్యలో మంచిగా రాణించాలని మీరు భవిష్యత్తులో ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలాని కోరారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెడు బుద్ధి ఉష, వార్డ్ మెంబర్ భూతరాజు బాలరాజు, గ్రామ సెక్రెటరీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Next Story