- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేజ్ వీల్స్ తో రోడ్ల పైకి వస్తే కఠిన చర్యలు : ఎస్సై నాగరాజు
దిశ, రామన్నపేట : కేజ్ వీల్ వాహనాలు రోడ్డు పై వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామన్నపేట ఎస్సై డి.నాగరాజు హెచ్చరించారు.

దిశ, రామన్నపేట : కేజ్ వీల్ వాహనాలు రోడ్డు పై వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామన్నపేట ఎస్సై డి.నాగరాజు హెచ్చరించారు. రామన్నపేట పోలీస్ స్టేషన్ లో బుధవారం మాట్లాడుతూ ట్రాక్టర్‌లను కేజ్ వీల్స్ తో బీటీ రోడ్లు, సీసీ రోడ్ల పై నడపడం వల్ల రోడ్లు డ్యామేజీ అవుతాయని అన్నారు. ట్రాక్టర్‌లను కేజ్ వీల్స్ తో బీటీ రోడ్లు, సీసీ రోడ్లపై నడిపే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ప్రభుత్వం ఎంతో వ్యయంతో ప్రజలకు మెరుగైన, సుఖవంతమైన ప్రయాణం కోసం రోడ్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. కొందరు ట్రాక్టర్ యజమానులు పొలాల్లో పని చేయడానికి కేజ్ వీల్స్‌ను రోడ్లపై ఉపయోగించడం వల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయని, ట్రాక్టర్ యజమానులు పొలాల్లో పనుల నిమిత్తం వెళ్ళేటప్పుడు తమ ట్రాక్టర్లను కేజ్ వీల్స్ తో రోడ్డుపై నడపవద్దని అలా నడపడం వల్ల రోడ్డు డ్యామేజ్ అయి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ట్రాక్టర్ కేజ్ వీల్స్ తో రోడ్లపైకి వచ్చే ట్రాక్టర్ యజమానులపై మోటారు వాహన చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని,ఈ విషయాన్ని ట్రాక్టర్ యజమానులు గమనించాలని అన్నారు.






