నిల్వ చేసిన ప‌త్తి.. అగ్నిప్ర‌మాదంలో ద‌గ్ధం

by Ratna Kumari |

దిశ‌, మునుగోడు : మండల పరిధిలోని కొంపల్లి గ్రామంలోని జాల వెంకన్న అనే రైతు ఇంటి ఆవరణంలో నిల్వ చేసిన పత్తి అనుమానస్పదంతో

నిల్వ చేసిన ప‌త్తి.. అగ్నిప్ర‌మాదంలో ద‌గ్ధం
X

దిశ‌, మునుగోడు : మండల పరిధిలోని కొంపల్లి గ్రామంలోని జాల వెంకన్న అనే రైతు ఇంటి ఆవరణంలో నిల్వ చేసిన పత్తి అనుమానస్పదంతో అగ్నికి దగ్ధం అయింది. ఇళ్ల మధ్యలో మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు నీళ్లు జల్లి వంటలు ఆర్పారు. చుట్టుపక్కల ఎలాంటి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేకపోవడంతో కావాలని పత్తికి నిప్పు అంటించారని బాధిత రైతు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పున్న‌ కైలాస్ నేత సంఘటన స్థలానికి చేరుకొని తగలబడిన పత్తిని పరిశీలించి.. బాధితుడు రైతు జాల వెంకన్నను పరామర్శించారు. అనంతరం మునుగోడు మండల కేంద్రంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన ఫర్నిచర్ తయారీ దుకాణాన్ని ఆయన పరిశీలించి యజమాని ప్రవీణ్ చారిని పరామర్శించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, మాజీ జిల్లా యూత్ కాంగ్రేస్ అధ్యక్షులు పాల్వాయి జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పందుల భాస్కర్, నాయకులు మదుప్రసాద్, సాగర్, ఎండి అన్వర్, పందుల నర్సింహా అప్పారావు, వెదిరే విజయేందర్ రెడ్డి ఉన్నారు.

Next Story