- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎట్టకేలకు జిల్లాకు విడుదలైన ఎస్సారెస్పీ జలాలు
ఎట్టకేలకు సూర్యాపేట జిల్లాకు శ్రీరాంసాగర్ రెండో దశ జలాలు సోమవారం విడుదలయ్యాయి. జనగామ జిల్లా కొడకండ్ల మండల

దిశ, తుంగతుర్తి: ఎట్టకేలకు సూర్యాపేట జిల్లాకు శ్రీరాంసాగర్ రెండో దశ జలాలు సోమవారం విడుదలయ్యాయి. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని బయన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి నీటిని విడుదల చేశారు. తొలుత 500 క్యూసెక్కుల నీటిని చేశారు. క్రమక్రమంగా దీని సామర్థ్యం పెంచనున్నారు. వాస్తవానికి ఆగస్టు రెండో వారంలోగా ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి నీటి విడుదల జరగాల్సి ఉంది. కానీ పై స్థాయిలో ఏర్పడ్డ పరిస్థితుల వల్ల దాదాపు నెల రోజులపాటు ఆలస్యమైంది.
విడుదలైన జలాలు తుంగతుర్తి నియోజకవర్గం గ్రామం వద్ద సూర్యాపేట జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చాయి.ఈ మేరకు అక్కడున్న 69,70,71 డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఆయా ప్రాంతాలకు పరుగులు పెట్టాయి.ముఖ్యంగా ఈ జలాలతో తుంగతుర్తి,సూర్యాపేట నియోజకవర్గంలోని మొత్తం మండలాలు,కోదాడ నియోజకవర్గంలోని మోతే,పెన్ పహాడ్, నడిగూడెం మండలాలలో నిండే చెరువులు,కుంటలు, తూముల ద్వారా 2 లక్షల 14 వేల ఎకరాలకు లబ్ధి చేకూరనుంది.
ఇందులో తుంగతుర్తి నియోజకవర్గానికి వచ్చేసరికి నూతనకల్,మద్దిరాల,తుంగతుర్తి,నాగారం, తిరుమలగిరి,అర్వపల్లి మండలాల్లో దాదాపు లక్ష ఎకరాలు ఉంటుంది. కార్యక్రమంలో ఈఈ సత్యనారాయణ,డిఈ సునీత,ఏఈలు చంద్రశేఖర్,హరి స్వరూప్,అఖిల్ తోపాటు తిరుమలగిరి,తుంగతుర్తి,నాగారం,అర్వపల్లి,నూతనకల్, మద్దిరాల మండలాలతో పాటు పాలకుర్తి నియోజకవర్గం లోని పలు ప్రాంతాలకు పలువురు పాల్గొన్నారు. ఇది ఇలా ఉంటే 2021 జనవరిలో తిరుమలగిరి నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా సూర్యాపేట జిల్లాకు నీటి విడుదల జరిగింది.ప్రతి ఏటా ఖరీఫ్,రబీ సీజన్లలో ఇది కొనసాగుతూ వస్తుంది.






