ఘనంగా కొనసాగుతున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

by Sridhar Babu |
ఘనంగా కొనసాగుతున్న  శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
X

దిశ, హుజూర్ నగర్ (మఠంపల్లి) : సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని మట్టపల్లి గ్రామంలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈనెల 21 నుంచి 26 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా రెండవ రోజు బ్రహ్మశ్రీ బొర్రా వాసుదేవాచార్యులు, ఆలయ అర్చకులు తూమాటి కృష్ణమాచార్యులు, తూమాటి శ్రీనివాసాచార్యులు, బ్రహ్మాచార్యులు, రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, బదరీనారాయణాచార్యులు, ఫణిభూషణమంగాచార్యులు, శ్రీ కొండవీటి శ్రీనాధ శర్మ, మహదేవశర్మ ఆధ్వర్యంలో ఉదయం లక్షమల్లికా పుష్పార్చన,

లక్ష్మీ అమ్మవార్ల సంవాదం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను చూసేందుకు చుట్టుపక్క గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బుధవారం రాత్రి 12 గంటలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి, రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుండి 20 వేల మంది వరకు భక్తులు హాజరవుతారని భావించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్ కుమార్, ఆలయ ఈవో సిరికొండ నవీన్ కుమార్ తెలిపారు.

Next Story