- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శివన్నగూడ ప్రాజెక్టు పనులు అడ్డుకున్న భూనిర్వాస్తులు
by Ratna Kumari |
మండలంలోని శివన్నగూడ గ్రామ పరిధిలో నిర్మాణంలో ఉన్న శివన్నగూడ రిజర్వాయర్ పనులు జరగకుండా నర్సిరెడ్డి గూడెం భూ నిర్వాసితులు శనివారం అడ్డుకున్నారు.

X
దిశ, మర్రిగూడ: మండలంలోని శివన్నగూడ గ్రామ పరిధిలో నిర్మాణంలో ఉన్న శివన్నగూడ రిజర్వాయర్ పనులు జరగకుండా నర్సిరెడ్డి గూడెం భూ నిర్వాసితులు శనివారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు భూనిర్వాసితులు మాట్లాడుతూ సంవత్సరం కింద నర్సిరెడ్డిగూడెం భూనిర్వాసితులను అధికారులు మభ్యపెట్టి గ్రామాన్ని ఖాళీ చేయించారని.. నేటికీ ప్రభుత్వ నుంచి రావాల్సిన ఆర్ అండ్ ఆర్ తో పాటు ప్లాట్లు ఇవ్వలేదని పూర్తిస్థాయిలో అందించిన తర్వాతనే పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రాజెక్టు పనులు జరగకుండా యంత్రాలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం.. రావాల్సిన బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు.
Next Story






