శాంతియుత ఎన్నికల కోసం ప్రజలు సహకరించాలి: ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌

by Bhanu |

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసిందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. జిల్లా పరిధిలో మూడు దశల్లో 869 గ్రామ పంచాయతీల్లో జరిగే ఎన్నికలకు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఒక అదనపు ఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 23 మంది సీఐలు, 84మంది ఎస్ఐలతో కలిపి 1680 మందితో పటిష్ట భద్రత ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

శాంతియుత ఎన్నికల కోసం ప్రజలు సహకరించాలి:  ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌
X

దిశ, నల్లగొండ క్రైం: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసిందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. జిల్లా పరిధిలో మూడు దశల్లో 869 గ్రామ పంచాయతీల్లో జరిగే ఎన్నికలకు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఒక అదనపు ఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 23 మంది సీఐలు, 84మంది ఎస్ఐలతో కలిపి 1680 మందితో పటిష్ట భద్రత ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా 442 గ్రామపంచాయతీలను సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో అదనపు బలగాలు, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్ పార్టీ అదనంగా పర్యవేక్షిస్తోందని అన్నారు. ఇబ్బంది లేదా సమస్య తలెత్తినా అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే పాత నేరస్తులు, రౌడీషీటర్స్ కదలికలను కట్టడి చేసేందుకు జిల్లా పోలీస్ కార్యాచరణ రూపొందించి, అన్ని కోణాల్లో దృష్టి సారించి జిల్లా వ్యాప్తంగా నేర చరిత్ర కలిగిన గత ఎన్నికల్లో కేసులలో గొడవల్లో ఉన్న 1141 పాత నేరస్తులు, రౌడీ షీటర్లను మందిని బైండోవర్ చేసి మళ్లీ ఇతర నేరాలకు పాల్పడకుండా వారి కదలికలపై నిఘా ఉంచామని అన్నారు. ఎవరైనా బైండోవర్ ఉల్లంఘించి గొడవలకు గానీ ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నందున ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, మంటను ప్రేరేపించే వస్తువులకు అనుమతి లేదని, ప్రజలంతా ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో 163 (బి.ఎన్.ఎస్.ఎస్) యాక్ట్ అమలులో ఉంటుందని, నలుగురు కంటే ఎక్కువగా గుంపులుగా ఉండకూడదని అన్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి 100 మీటర్ల దూరంలో ఎవరూ ఉండరాదని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాలలో గానీ, పరిసర ప్రాంతాల్లో గానీ ఓటర్లను ప్రలోభ పెట్టె వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఎవరైనా నగదు, మద్యం, ఇతరత్రా వస్తువులను ఎవరైనా పంపిణీ చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100కి సమాచారం అందజేయాలని కోరారు. ఎన్నికల నియమావళి ప్రకారం పోలీసులు చేపట్టే చర్యలను అతిక్రమిస్తే అట్టి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాబట్టి పోలింగ్ ప్రక్రియకు ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Next Story