పాము కాటుతో మహిళ మృతి...

by Bhanu |

పాముకాటుతో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని పైల్వాన్ పురం ఆవాస గ్రామం పళ్లెంపు గ్రామంలో చోటుచేసుకుంది.

పాము కాటుతో మహిళ మృతి...
X

దిశ, వలిగొండ : పాముకాటుతో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని పైల్వాన్ పురం ఆవాస గ్రామం పళ్లెంపు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. మద్ది అరుణమ్మ (58) మంగళవారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు ఇంట్లో నిద్రలోంచి లేస్తుండగా పాము కాటు వేసిందని ఇంటి ప్రక్కన ఉన్న మద్ది మల్లారెడ్డి కి సమాచారం ఇవ్వగా అతను ఆమె కుమారులకు సమాచారం అందించగా 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అటు నుండి మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినది. మృతురాలికి మద్ది మధుసూదన్ రెడ్డి, మద్ది మాధవరెడ్డిలు ఇద్దరు కుమారులు వీరు వృత్తిరీత్యా భువనగిరి,ఉప్పల్ లో ఉంటున్నారు. మృతురాలి కుమారుడు మద్ది మధుసూదన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగేందర్ గౌడ్ తెలిపారు.

Next Story