సర్‌ సమయానికి పూర్తయ్యేనా...!

by Kodari Anjali |

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో తప్పుల్లేని ఓటరు జాబితా రూపొందించేందుకు చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో జోరుగా సాగుతోంది.

సర్‌ సమయానికి పూర్తయ్యేనా...!
X

దిశ, నల్లగొండ బ్యూరో: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో తప్పుల్లేని ఓటరు జాబితా రూపొందించేందుకు చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో జోరుగా సాగుతోంది. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ పూర్తి కాలేదు. ఓటర్ల అడ్రస్‌లు మారడం, కొంత మంది ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం, పట్టణాల్లోని అద్దె ఇళ్లలో ఉండే వారు ఇతర ఇళ్లకు లేదా సొంతిల్లు కట్టుకుని వెళ్లడం జరిగింది. దీంతో ఓటర్లు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వారికి గణన ఫారాలు అందించడం బీఎల్‌వోలకు తలనొప్పిగా మారింది. ఉమ్మడి జిల్లాలో 23 లక్షలకు పైగా ఓటర్లు అందులో కనీసం 40 శాతం ఫారాలు కూడా ఓటర్లకు చేరలేదని స్వయంగా అధికారులే చెపుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో జూలై 24 అంటే మరో 20 రోజుల్లో మొత్తం ఫారాలు ఓటర్ల కు తిరిగి అధికారులకు చేరడం సాధ్యమయ్యే పని కాదని తెలుస్తోంది. ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ మొదలు భర్తీ చేయ డం, తిరిగి ఇవ్వడంలోనూ, ఓటర్లుగా తమ అర్హతలను నిరూపించుకునే విషయంలోనూ ఓటర్లకు సవాలక్ష సందేహా లు వ్యక్తమవుతున్నాయి.

జూలై 24 వరకు గడువు....

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 2300561. అందులో పురుషులు 11,36,180, మహిళలు 1164300 ఉన్నారు.. జిల్లాల వారీగా చూస్తే నల్గొండ 1073506, సూర్యాపేట 694815, యాదాద్రి భువనగిరి 532240 మంది ఓటర్లు ఉన్నారు.. ఎన్నికల సంఘం చేపట్టే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ముఖ్యమైన ఉద్దేశం ప్రకారం ఓటర్ జాబితాను పారదర్శకంగా, ఎటువంటి తప్పులు దొర్లకుండా సిద్ధం చేయడం. దాంతోపాటు 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం మరణించిన వారి పేర్లు ,ఒకే చోట ఉన్న డూప్లికేట్ ఓట్లను తొలగించడం కోసం ఈ ఎస్ ఐ ఆర్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. జూన్ 25 2026 నుంచి జూలై 24, 2026 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. బీఎల్ ఓ లు ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్ ఫారం ను పంపిణీ చేస్తారు. ఓటర్లకు సంబంధించిన వివరాలను నింపుటకు సహాయం చేసి ఎన్యుమరేషన్ ఫారం ను ఓటరు దగ్గర నుంచి తీసుకుంటారు.

2002 ఓటు వివరాలు తప్పని సరి..

ఎన్యూ మరేషన్ ఫారంలో 2002 ఓటు వివరాలు కచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది. తన ఓటు వివరాలు ఆ ఫారంలో రాస్తూనే, దాంతో పాటుగా తన తండ్రి తల్లి అన్న అక్క తదిత రక్త సంబంధీకులు వివరాలను అందులో పొందుపరచాల్సి ఉంటుంది. లేకపోతే ఓటు హక్కును రద్దు చేసే అవకాశం ఉంది. రద్దు చేసే ముందు కూడా అధికారులు లేని సదరు ఓటరుకు ఒక నోటీసు పంపించి ముందస్తుగా తెలియజేస్తారు. ఆ నోటీసు ప్రకారం ఎస్ ఐ ఆర్ నిబంధన ప్రకారం వివరాలు అందిస్తే ఓటు భద్రంగా ఉంటుంది లేకపోతే కష్టమే. బంధుత్వం వివరాలు పెట్టాల్సిన అవసరం ఏంటంటే ఈ దేశంలో రాష్ట్రంలో జిల్లాలో జన్మించి ఉంటే బంధుత్వం తప్పనిసరి ఉంటుంది. అనుమతి లేకుండా అక్రమంగా దేశంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నివసిస్తున్న వారి వివరాలను తెలుసుకునేందుకే 2002 ఓటర్ వివరాలను అడుగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

10 శాతం కూడా ఫారాలు చేరలే....

ప్రతి బీఎల్ ఓ 1000 మంది ఓటర్లు కు సంబంధించిన ఫారాలను విచారణ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఎన్యూమరేటర్ ఫారాలు బీఎల్ఓ వద్ద ఉంటాయి. ఆ ఫారం మీద గత ఎన్నికలకు సంబంధించిన ఫొటో ఉంటుంది.. పక్కనే ప్రస్తుత ఫొటో ఒకటి పెట్టాలి. అయితే ఉమ్మడి జిల్లాలో 23 లక్షలకు పైగా ఓటర్లు అందులో కనీసం 40 శాతం ఫారాలు కూడా ఓటర్లకు చేరలేదని స్వయంగా అధికారులే చెపుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో జూలై 24 అంటే మరో 20 రోజుల్లో మొత్తం ఫారాలు ఓటర్ల కు తిరిగి అధికారులకు చేరడం సాధ్యమయ్యే పని కాదని తెలుస్తోంది. అంతేగాకుండా "ఎస్ ఐ ఆర్" పై విద్యావంతులకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన లేదనే విషయం బహిరంగ రహస్యమే.

డబుల్ ఓట్లకు చెక్...

జిల్లాలో ఇక డబుల్ ఓట్లకు చెక్ పడింది. పల్లెల నుంచి మండలాలకు జిల్లాలకు ఓటర్లు వలసొలొచ్చారు. ఆ ఓటర్లు తమ ఓట్లను సొంత గ్రామంతో పాటు పట్టణాల్లో కూడా నమోదు చేసుకొని ఓటు వేస్తున్నారు. . ఈ విషయం అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. ముఖ్యంగా మున్సిపల్ కేంద్రాలు రెవెన్యూ డివిజన్ కేంద్రాలు జిల్లా కేంద్రాలలో ఉండే ఓట్లలో 15 నుంచి 20 శాతం మందికి రెండు చోట్ల ఉంటాయి. అయినా ఏ ఒక్క పార్టీ కూడా డబుల్ ఓట్లను తొలగించడానికి సీరియస్ గా ప్రయత్నం చేయలేదు దాంతో ఓటర్లు అక్కడ ఓట్లు వేస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎస్ ఐ ఆర్ ద్వారా ప్రతి ఓటర్కు ఒకే చోట మాత్రమే ఓటు ఉండే అవకాశం ఉంది. ఎక్కడ ఓటు ఉండాలో ఓటర్లు స్పష్టంగా చెప్పాల్సింది లేకపోతే ఓట్లు పూర్తిగా తొలగించే అవకాశం కూడా ఉంది. అందుకే ఓటర్లు తమ ఓటును ఎక్కడ నమోదు చేసుకోవాలో స్పష్టంగా తెలియాలి లేకపోతే ఓటు కోల్పోయే ప్రమాదం ఉంది.

2002 సమాచారం దొరకడం కష్టంగా ఉంది: కౌసర్ బిఎల్‌వో నల్గొండ

2002 ఓటర్ జాబితాకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం దొరకడం కొంత కష్టంగానే ఉంది. ముఖ్యంగా వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. . ఆ సమాచారం సేకరించడం కోసం ఆలస్యం అవుతుంది. ఓటర్లు అంతే తొందరగా ఎస్ ఐ ఆర్ కార్యక్రమానికి స్పందించడం లేదు.

Next Story