- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీపీఐ సీనియర్ కార్యకర్త మృతి
దిశ, చిలుకూరు : మండల కేంద్రం చిలుకూరులో శనివారం సీపీఐ సీనియర్ కార్యకర్త ముక్కా (మైక్) కోటయ్య(68) గుండెపోటుతో మృతి చెందారు.

X
దిశ, చిలుకూరు : మండల కేంద్రం చిలుకూరులో శనివారం సీపీఐ సీనియర్ కార్యకర్త ముక్కా (మైక్) కోటయ్య(68) గుండెపోటుతో మృతి చెందారు. ఈయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా ఎర్రజెండా భుజాన మోస్తూ నిఖార్సైన సీపీఐ కార్యకర్తగా మండలంలో సుపరిచితమైన కోటయ్య మృతిపై పలువురు విచారం వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్.. కోటయ్య మృతదేహంపై పార్టీ జెండా కప్పి పూలమాల వేసి నివాళులర్పించారు. మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, షేక్ సాహెబ్ అలీ, చేపూరి కొండలు, బాలెబోయిన రాంబాబు, దొడ్డా రమేష్ బాబు, మండవ అచ్చయ్య, కస్తూరి సైదులు, షేక్ హుస్సేన్, కట్టెకోల నాగేశ్వరరావు, దొడ్డా నాగేశ్వరరావు నివాళులు అర్పించారు.
Next Story






