- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ షాపింగ్ మాల్ కి వెళ్లాలటే భయం..!
రక్షణ లేని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లతో ప్రమాదం పొంచి ఉంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం సమీపంలో ఓ షాపింగ్ మాల్ త్వరలో ప్రారంభం కానుంది. షాపింగ్ మాల్ నిర్వాహకులు షాపింగ్ మాల్ ముందు ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.

దిశ, సూర్యాపేట : రక్షణ లేని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లతో ప్రమాదం పొంచి ఉంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం సమీపంలో ఓ షాపింగ్ మాల్ త్వరలో ప్రారంభం కానుంది. షాపింగ్ మాల్ నిర్వాహకులు షాపింగ్ మాల్ ముందు ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పబ్లిసిటీ కోసం ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు తప్ప ప్రారంభోత్సవ సందర్భంగా షాపింగ్ మాల్ వద్దకు వచ్చే ప్రజలకు రక్షణ కల్పించడం మరిచిపోయారు. గతంలో జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ వద్ద కరెంట్ ట్రాన్స్ ఫార్మర్ తీగ తగిలి వ్యక్తి మరణించిన విషయం విధేయతమే. షాపింగ్ మాల్ ముందు ప్రమాదకరంగా రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉంటే సంబంధిత అధికారులు కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో రహదారుల వెంట వివిధ షాపులకు చెందిన నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్న కరెంట్ ట్రాన్స్ ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి.
భయాందోళనకు గురవుతున్న ప్రజలు
విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటంతో ఆయా దారిలో వెళ్లే ప్రజలు, చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారు. పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్ వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా విద్యుత లైన్ ల విస్తరణ కూడా జరగుతోంది. అయితే తదనుగుణంగా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు తలేత్తకుండా అదనపు ట్రాన్సఫార్మర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ట్రాన్సఫార్మర్ల ఏర్పాటు చేసే సమయంలో తీసుకోవాల్సిన కనీస నిబంధనలను మరిచిపోతున్నారు. పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం చూసి చూడనట్లుగా వ్యవరిస్తుండటంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి
కొత్త షాపింగ్ మాల్ ముందు ఉన్న ట్రాన్సఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ లేకుంటే కంచె ను ఏర్పాటు చేయాలనీ జిల్లా ప్రజలు కోరుతున్నారు. త్వరలో సినీనటి నిధి అగర్వాల్ ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి రావడంతో భారీ ఎత్తున ఆమె అభిమానులు ఆమెను చూడడం కోసం షాపింగ్ మాల్ కు వచ్చే అవకాశం ఉంది. కనీసం షాపింగ్ మాల్ నిర్వాహకులు కనీస రక్షణ చర్యలు కూడా తీసుకోలేదు జరగారాని ప్రమాదం ఏమైనా జరిగితే భారీగా ప్రాణ నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు, షాపింగ్ మాల్ నిర్వాహకులు మేల్కొని తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని షాపింగ్ మాల్ ముందు ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు షాపింగ్ మాల్ నిర్వాహకులను, సంబంధిత అధికారులను కోరుతున్నారు.






