భూ భారతిలో కుంభకోణం

by Ratna Kumari |

భూ భారతి రిజిస్ట్రేషన్ లావాదేవీలలో తక్కువ స్టాంపు డ్యూటీ చెల్లించి, తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించారు.

భూ భారతిలో కుంభకోణం
X

దిశ‌, వ‌లిగొండ : భూ భారతి రిజిస్ట్రేషన్ లావాదేవీలలో తక్కువ స్టాంపు డ్యూటీ చెల్లించి,తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించారు. రికార్డుల ప్రకారం.. చెల్లించవలసిన మొత్తాన్ని,41 రిజిస్ట్రేషన్ లావాదేవీలలో 15,58,472 రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి..ఆన్ లైన్ మోసగాళ్ల కల్లరి మధు, ఏం భువనేశ్వర్, పి బసవరాజు, రాకేష్, శివరామకృష్ణ,రాజులపై మంగళవారం తహశీల్దార్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. వీరిపై సెక్షన్,316(2), 316(5), 336(3), 337, 338, 340(2), 318(4), 111(2), (3), (6), 61(2),రెడ్ విత్ 3(5) BNS ఐటీ సెక్షన్ చట్టంలోని సెక్షన్ 66(D), క్రైమ్ నెంబర్ 10/2026 కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగేందర్ గౌడ్ తెలిపారు.

Next Story