- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ సేవలు మెరుగుపరచాలి : ఎమ్మెల్యే బాలు నాయక్
దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ను ఆర్టీసీ డిపో నూతన మేనేజర్ విజయకుమారి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

దిశ, దేవరకొండ టౌన్ : దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ను ఆర్టీసీ డిపో నూతన మేనేజర్ విజయకుమారి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మేనేజర్‌కు ఎమ్మెల్యే అభినందనలు తెలిపి, ఈ సందర్భంగా డిపో నిర్వహణ, ప్రయాణికుల సేవలు అంశాలపై పలు సూచనలు చేశారు. ప్రయాణికులకు మరింత మెరుగైన, నాణ్యమైన ప్రజా రవాణా సేవలు అందించాలని ఎమ్మెల్యే కోరారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నందున, మహిళా ప్రయాణికుల పట్ల ఆర్టీసీ సిబ్బంది అత్యంత మర్యాదపూర్వకంగా, వినయంగా నడుచుకునేలా చర్యలు తీసుకోవాలని మేనేజర్‌కు ప్రత్యేకంగా సూచించారు. ప్రయాణికులందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన ప్రజా రవాణా సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పడాల సైదులు, సిబ్బంది పాల్గొన్నారు.






