- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీస్ వెహికల్, 102 వాహనం ఢీ
మండలంలోని పాటిమట్ల సమీపంలో గురువారం 11 గంటల ప్రాంతంలో ఎదురెదురుగా... Road Accident Near Patimatla

దిశ, మోత్కూరు: మండలంలోని పాటిమట్ల సమీపంలో గురువారం 11 గంటల ప్రాంతంలో ఎదురెదురుగా వస్తున్న పోలీస్ పెట్రోలింగ్ వాహనం, 102 అంబులెన్స్ మూల మలుపు వద్ద బలంగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో పోలీస్ పెట్రోలింగ్ నడుపుతున్న శ్రీనివాస్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. పెట్రోలింగ్ వాహనం మోత్కూర్ కు వస్తుండగా మోత్కూర్ నుండి అడ్డగూడూరు వెళ్తున్న 102 వాహనం అధిక వేగంతో వెళ్తుండగా మూలమలుపు వద్ద అదుపుతప్పి పోలీసు వాహనం ఢీకొనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా ఈ సంఘటనలో రెండు వాహనాల ముందు చక్రాలు ఊడిపోవడం చూస్తుంటే వాహనాల్లో ప్రయాణించినవారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని సంఘటన స్థలిని చూసిన ప్రజలు వాపోతున్నారు.
మూడు నెలల లోపే మూడు వాహనాలకు ప్రమాదాలు:
మోత్కూరు పోలీస్ స్టేషన్ కు చెందిన రెండు పెట్రోలింగ్ వాహనాలు, ఒక బొలెరో వాహనం మూడు నెలల లోపే ప్రమాదాలకు గురికావడం పట్ల యాదృచ్ఛికంగా జరిగాయా ఇటువంటి సంఘటనలు పునరావృతం కావడం ఏమిటనే చర్చ జరుగుతుంది.






