వడ్లు కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన అన్నదాతలు

by Disha Web Desk 6 |
వడ్లు కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన అన్నదాతలు
X

దిశ, డిండి: డిండి మండలం టి. గౌరారం గేటు వద్ద శనివారం రోజు రైతులు వడ్లు కొనుగోలు చేయాలని రోడ్డుపై ధాన్యం పోసి తమ నిరసనను తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్లు కొనుగోలు కేంద్రం టి. గౌరారం గేటు వద్ద రోజుల తరబడి నిరీక్షించిన వడ్లను కొనుగోలు చేస్తలేరని, తాము కష్టపడి పంటలను పండించి కొనుగోలు కేంద్రానికి వడ్లను తీసుకువచ్చిన సంబంధిత అధికారులు వడ్లు కొనుగోలు చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇప్పటికే అకాల వడగండ్ల వర్షాలకు పంటలు నష్టపోయి అప్పుల్లో కురుకుపోయామని తెలిపారు. ఉన్న కొద్దిపాటి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే అధికారులు రోజుల తరబడి నిరీక్షించే విధంగా చేస్తున్నారని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

స్పందించిన అధికారులు

వడ్లు కొనుగోలు కేంద్రం టి. గౌరారం గేటు వద్ద రైతులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం తెలిసిన డిండి తహసీల్దార్ చంద్రశేఖర్ తరలి వెళ్లారు. రైతులతో మాట్లాడి సమస్యను పునరావృతం కాకుండా లారీల కొరత ఉన్నందున, ట్రాక్టర్లలో కొనుగోలు చేసిన ధాన్యాలను సంబంధిత మిల్లులకు చేరవేస్తామని తెలిపారు. రైతులు తమ నిరసన కార్యక్రమాన్ని విరమింపజేశారు. తహసీల్దార్ వెంట ఆర్.ఐ. గోపరాజు, పోలీసులు ఉన్నారు.


Next Story

Most Viewed