- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గృహ జ్యోతి ద్వారా నిరుపేదలకు ఊరట
ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి స్పష్టం చేశారు.

దిశ, కోదాడ : ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల వ్యవధిలోనే ఆరు గ్యారంటీలను అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలుపుకుంటోందని తెలిపారు.శనివారం కోదాడ మండలం తొగర్రాయి గ్రామంలో నిర్వహించిన గిరిజనుల ఆరాధ్య దైవాలు సమ్మక్క-సారక్క జాతరలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనం ఎత్తి మొక్కు చెల్లించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్ల ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రైతాంగానికి సమృద్ధి వర్షాలతో పంటలు పండాలని కోరుకున్నారు.
సేవా భావానికి ప్రతీకగా అన్నదానం
జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రారంభించారు.ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని, గిరిజనుల ఆరాధ్య దైవాల పట్ల ప్రత్యేక గౌరవం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా పూజారి గౌని సైదమ్మ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి గాజులు, ప్రసాదాలు అందజేశారు.కాంగ్రెస్ హామీలే ప్రజల జీవితాల్లో మార్పుగృహ జ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, లబ్ధిదారులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాసిన లేఖను అందజేశారు. గృహ జ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం వల్ల నిరుపేద కుటుంబాలకు భారీ ఊరట లభించిందని చెప్పారు.
52.83 లక్షల కుటుంబాలకు
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 52.83 లక్షల కుటుంబాలకు సంబంధించిన రూ.3,593 కోట్ల విద్యుత్ బిల్లులను ప్రభుత్వం నేరుగా చెల్లించడం కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణకు, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గతంలో పాలించిన వారు హామీలను కేవలం ప్రకటనలకే పరిమితం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేసి చూపుతోందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల విమర్శలకు ప్రజలే సమాధానంకాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిరాధార విమర్శలు చేస్తున్నాయని, కానీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న ప్రజలే వాటికి సరైన సమాధానం ఇస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. విద్యుత్ బిల్లుల భారం తగ్గడంతో ఆదా అయిన డబ్బును ప్రజలు ఆరోగ్యం, పిల్లల చదువు, కుటుంబ అవసరాలకువినియోగించుకుంటుండటం ప్రభుత్వ విజయానికి నిదర్శనమని అన్నారు.ప్రజల పక్షానే కాంగ్రెస్ ప్రభుత్వంప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, ఒక్కో హామీని దశలవారీగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి స్పష్టం చేశారు. కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లిక్కి వెంకటయ్య–గుర్వమ్మ, విద్యుత్ శాఖ అధికారులు డీఈఈ కృష్ణయ్య, ఏడీఈ వెంకన్న, ఏఈ సైదా, మండల నాయకులు వరప్రసాద్ రెడ్డి, సీతారాంరెడ్డి, శ్రీనివాసరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు జడ వెంకటేష్, మదన్, మాజీ అధ్యక్షుడు వెంకన్న, సులోచనరావు, వార్డు సభ్యులు సంధ్య, వీరయ్య, వినోద్, కిషోర్, ఏ.శ్రీను, సులోచన, పి.వెంకన్న, బి.వేలాద్రి, కె.కొండలు, బి.వెంకన్న, టి.ఏసుకొండలు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






