పాలకవీడు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఆర్. కోటేష్

by Bhanu |

పాలకవీడు మండలంలో కొత్త ఎస్సైగా రవ్వ కోటేష్ ఆదివారం విధుల్లో చేరారు.

పాలకవీడు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఆర్. కోటేష్
X

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు) : పాలకవీడు మండలంలో కొత్త ఎస్సైగా రవ్వ కోటేష్ ఆదివారం విధుల్లో చేరారు. 2014 బ్యాచ్‌కు చెందిన కోటేష్ ఇప్పటివరకు రాష్ట్రంలోని పలు కీలక ప్రాంతాల్లో సేవలందించారు. ప్రాథమికంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన ఆయన, అనంతరం 317 జీవో కింద నల్గొండ జిల్లాకు వచ్చారు.


అక్కడ మిర్యాలగూడ ట్రాఫిక్ విభాగంలో సేవలందించడంతో పాటు షీ టీంలో కూడా పనిచేశారు. ఆ తర్వాత దేవరకొండ టౌన్‌కి బదిలీ కావడంతో అక్కడ విధులు నిర్వహించారు. అక్కడినుండి నేరేడుగోమ్ము ఎస్సైగా ఉన్న కోటేష్ ఇప్పుడు పాలకవీడు ఎస్సైగా బదిలీపై వచ్చారు. ఇక్కడ గతంలో పనిచేసిన ఎస్సై లక్ష్మీ నరసయ్య బదిలీపై భువనగిరి టౌన్‌కి వెళ్లారు.

Next Story