మార్చి 12న స‌ర్పంచ్ ల‌కు ఓరియెంటేష‌న్ శిక్ష‌ణ : ఎంపీడీఓ జయరాం విజయ్

by Ratna Kumari |   (  Updated:2026-03-11 08:50:54  IST  )

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు జిల్లా స్థాయి ఓరియెంటేషన్ శిక్షణ కార్యక్రమం మార్చి 12న నిర్వహించనున్నట్టు నేరేడుగొమ్ము మండల ఎంపీడీఓ జయరాం విజయ్ తెలిపారు.

మార్చి 12న స‌ర్పంచ్ ల‌కు ఓరియెంటేష‌న్ శిక్ష‌ణ : ఎంపీడీఓ జయరాం విజయ్
X

దిశ, నేరేడుగొమ్ము : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు జిల్లా స్థాయి ఓరియెంటేషన్ శిక్షణ కార్యక్రమం మార్చి 12న నిర్వహించనున్నట్టు నేరేడుగొమ్ము మండల ఎంపీడీఓ జయరాం విజయ్ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రం అయిన న‌ల్గొండ‌లో.. మిర్యాలగూడ రోడ్డులో ఉన్న‌టువంటి అచూరి గార్డెన్స్‌లో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని ఆయన చెప్పారు. గ్రామపంచాయతీల నిర్వహణ, పరిశుభ్రత, పారిశుధ్యం, రికార్డుల నిర్వహణ, పరిపాలనా సామర్థ్యాల పెంపు వంటి అంశాలపై సర్పంచ్‌లకు మార్గదర్శకత్వం ఇవ్వనున్నట్లు తెలిపారు. నేరేడుగొమ్ము మండలానికి చెందిన అన్ని గ్రామాల సర్పంచ్‌లు ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీడీఓ జయరాం విజయ్ సూచించారు. మండలంలోని పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్‌లకు సమాచారం అందించి కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Next Story