- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త సంవత్సరం వేడుకల్లో అప్రమత్తంగా ఉండాలి : డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి
దిశ, కోదాడ : నూతన సంవత్సరం 2026 వేడుకలను ప్రజలందరూ శాంతియుతంగా సురక్షితంగా జరుపుకోవాలని కోదాడ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి బుధవారం కఠిన హెచ్చరికలు జారీ చేశారు.

దిశ, కోదాడ : నూతన సంవత్సరం 2026 వేడుకలను ప్రజలందరూ శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలని కోదాడ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి బుధవారం హెచ్చరికలు జారీ చేశారు. వేడుకల పేరుతో మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, ప్రమాదకర డ్రైవింగ్, బైక్ స్టంట్లు, యువత గుంపులుగా తిరగడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త సంవత్సరం సందర్భంగా లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాత్రి 9 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.పబ్లిక్ రోడ్లు, చౌరస్తాలు, ఫ్లైఓవర్లు, బస్టాండ్‌ల వద్ద గుంపులుగా చేరి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక పర్యవేక్షణ వహించాలని, ప్రమాదకర పరిస్థితులకు దూరంగా ఉంచాలని సూచించారు.ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఘటనలు గమనిస్తే వెంటనే 100 లేదా 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ కోరారు. కొత్త సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా సాగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.






