- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈనెల 20న ఛలో హైదరాబాద్.. నేతన్నల మహాధర్నా..!
దిశ, తిరుమలగిరి : చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పట్టించుకోవాలని కోరుతూ ఈ నెల 20న హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర చేనేత కమిషనర్

దిశ, తిరుమలగిరి : చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పట్టించుకోవాలని కోరుతూ ఈ నెల 20న హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర చేనేత కమిషనర్ కార్యాలయం ఎదుట నిర్వహించే నేతన్నల మహా ధర్నాను జయప్రదం చేయాలని చేనేత కార్మిక సంఘం నాయకుడు వంగరి బ్రహ్మం పిలుపునిచ్చారు. చేనేత కార్మికులకు హామీ ఇచ్చిన రుణమాఫీ, నేతన్న భరోసా పథకంను ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేయడం, చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం, త్రిఫ్ట్ పథకం నిధులు విడుదల చేయడం, నేతన్న భీమా మొత్తాన్ని ఒక నెలలోగా కుటుంబాలకు అందజేయడం వంటి ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ మహా ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు.మంగళవారం తిరుమలగిరి చేనేత సహకార సంఘం ఆవరణలో నిర్వహించిన సమావేశంలో మహా ధర్నా కరపత్రాలను ఆవిష్కరించి కార్మికులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో దుస్స రామ్మూర్తి, మద్దూరి శంకరయ్య, వంగరి సూర్యనారాయణ, వంగరి సోమయ్య, అమృతం రాజు, మద్దూరి కృష్ణమూర్తి, రాపోలు కొండయ్య, అక్కల ఉప్పలయ్య, వంగరి పెద్ద సోమయ్య, వంగరి సోమకృష్ణ, వీరబత్తిని మల్లయ్య, మద్దూరి ఉమేష్, ఎనగందుల రవి, వెంగళి మధు, మంచే అంబదాస్, మద్దూరి శ్రీనివాస్, వీరబత్తిని మురళీ, కోట రాములు, వంగరి కిషన్ పాల్గొన్నారు.






