న‌ర‌సింహా మృతి బీఆర్ఎస్ కి తీర‌ని లోటు : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

by Ratna Kumari |   (  Updated:2025-12-26 09:50:23  IST  )

దిశ, రామన్నపేట : రామన్నపేట మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ నాయకులు అకస్మికంగా మృతి చెందడం పార్టీకి తీరని లోటని నకిరేకల్

న‌ర‌సింహా మృతి బీఆర్ఎస్ కి తీర‌ని లోటు : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
X

దిశ, రామన్నపేట : రామన్నపేట మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ నాయకులు అకస్మికంగా మృతి చెందడం పార్టీకి తీరని లోటని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నరసింహ మృత దేహాన్ని ఆయన సందర్శించి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులతోపాటు ఏఐటీయూసీ, సీఐటీయూ, కార్మిక సంఘాలు వేరు వేరుగా మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్, సీపీఎం జిల్లా నాయకులు మేక అశోక్ రెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ, వివిధ పార్టీల నాయకులు జినుకల ప్రభాకర్, జెల్ల వెంకటేష్, వనం చంద్రశేఖర్, బండ లింగస్వామి, ఎండి నాసర్, గొరిగే శేఖర్, పల్లపు రవి, పోషబోయిన మల్లేశం, కంభంపాటి శ్రీనివాస్, నీల దయాకర్, బందెల రాములు, బద్దుల రమేష్ పాల్గొన్నారు.

Next Story